టాలీవుడ్ సెలబ్రిటీస్ 12 మందికి సిట్ అధికారులు డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చారని... వారి పేర్లు మీడియాలో వార్తలు రావడం ఆలస్యం... మాకు డ్రగ్స్ కి సంబంధం లేదంటూ చాలామంది మీడియాలో హడావిడి చేసిన సంగతి తెలిసందే. కొందరు నోటీసులు అందుకున్నామని... సిట్ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటామని చెబితే మరికొందరు అసలు మాకు డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఏమిటండి... మాకసలు నోటీసులు రాలేదు... ఇలాంటి వార్తలు సృష్టించి మా కెరీర్ ని నాశనం చేస్తున్నారంటూ లబోదిబోమన్నారు. వారిలో ముఖ్యంగా నటులు తనీష్, నందులు ఉన్నారు.
ఇకపోతే గత 10 రోజులనుండి నోటీసులు అందుకున్న వారు సిట్ ముందు విచారణకు హాజరవుతున్నారు. ఈనేపధ్యంలో ఎలాంటి అరెస్ట్ లు జరగకుండానే సిట్ అధికారులు సదరు సీలెబ్రిటీస్ ని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే వారు ముందు హడావిడి చేసినప్పటికీ సైలెంట్ గా సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు జవాబులు చెబుతున్నారు. ఇక తనిషేమో తననేదో మీడియానే టార్గెట్ చేసినట్టు తన తల్లి ఈవిషయంలో చాలా బాధపడుతోందని.... తన తండ్రి సడన్ గా చనిపోవడంతో ఆ తర్వాత ఇంటికి తనే పెద్ద దిక్కుగా మారానని.. ఇలాంటి టైం లో నన్ను ఇలా ఇబ్బందులు పాలు చేయొద్దంటూ మీడియాని వేడుకున్నాడు.
మరి అంత చెప్పిన తనీష్ నాకు నోటీసులు అందలేదంటూనే ఇప్పుడు ఈరోజు సోమవారం సిట్ ముందు హాజరయ్యాడు. మరి మీడియా ఏదో కావాలనే తన పేరు హైలెట్ చేసినట్టు ఫీల్ అయిన తనీష్ ఇప్పుడు మరి సిట్ ముందు ఎలా హాజరయ్యాడానే...గుసగుసలు వినబతున్నాయి. ఇక సిట్ అధికారులు తనీష్ ని ఎంతసేపు ప్రశ్నించనున్నారో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.