డీజే సినిమా హిట్ అనాలో లేక ఫట్ అనాలో తెలియక తికమక పడ్డ బన్నీ ఇప్పుడు తన దృష్టాంతా వక్కంతం వంశి సినిమాపైనే పెట్టాడు. వక్కంతం వంశి మొదటిసారి డైరెక్షన్ చేస్తున్న నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా లో అల్లు అర్జున్ మిలటరీ ఆఫీసర్ అవతారం ఎత్తుతున్నాడు. ఇక ఈ సినిమా ఆఫీసియల్ గా సెట్స్ మీదకెళ్ళిపోయింది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. కారణం ఈ చిత్రంలో మిలటరీ ఆఫీసర్ గా కనబడాలంటే మంచి ఫిజిక్ ఉండాలని.... అలాగే కథ కోసమే మేకోవర్ అవ్వాలని అల్లు అర్జున్ అమెరికా వెళ్లాలనుకున్నాడు. ఇదే విషయం నిన్న బుధవారం సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.
అయితే బన్నీ అమెరికా వెళ్లి టాప్ ట్రైనర్ దగ్గర మేకోవర్ అవ్వాలంటే గనక ఖచ్చితంగా మూడు వారాలైనా సమయం పట్టే అవకాశం ఉండడంతో బన్నీ తన ఆలోచన మార్చుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక బన్నీ అమెరికా వెళ్లకుండా ఆ ట్రైనర్ నే హైదరాబాద్ రప్పించాలనే ఆలోచనలో ఉన్నాడట. అలాగే ట్రైనర్ సమక్షంలో శిక్షణ తీసుకున్న అర్జున్ ఆగష్టు రెండో వారంనుండి నా పేరు సూర్యా షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. ఇక ఈ చిత్ర కథ మొత్తం దేశభక్తి నేపథ్యంలో ఉండబోతుందని తెలిసిన విషయమే.
ఇక నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా చిత్రంలో బన్నీకి జోడిగా అను ఇమ్మాన్యువల్ మొదటిసారి నటిస్తుంది. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుని వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయాలనీ డైరెక్టర్ వక్కంతం వంశి భావిస్తున్నాడట.