లక్కు తిరిగింది

Update: 2018-02-12 09:46 GMT

జై లవ కుశ లో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన నటించినా లక్కు కలిసి రాని రాశి ఖన్నాకు, తొలిప్రేమ సినిమాతో మంచి విజయమే లభించింది . వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో వర్ష పాత్రలో రాశి ఖన్నా ఇరగదీసింది. లుక్స్ పరంగాను, యాక్టింగ్ పరంగాను, అలాగే ఎమోషన్స్ ని పలికించడం ఇలా అన్ని కోణాల్లో రాశి ఖన్నా బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా చేతిలో సరైన హిట్ లేకుండా బాధ పడుతూ బొద్దుగా ఎబ్బెట్టుగా తయారైన రాశి ఖన్నా ఇప్పుడు మంచి ఫిట్నెస్ తో సన్నజాజిలా తయారైంది. మరి సన్నని అందాలతో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న రాశి ఖన్నాకి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు.

తొలిప్రేమలో రాశి ఖన్నా వరుణ్ తేజ్ తో పోటీపడి నటించడమే కాదు అందరితో శెభాష్ అనిపించుకుంది. వర్ష పాత్రలో అల్లరితో పాటు అభినయంతో అందరిని కట్టిపడేసిన రాశికి ఈ సినిమాతో మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం వంద శాతం ఉంది. రాశి ఖన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు నటించిన ఊహలు గుస గుసలాడే సినిమాలో రాశి పెరఫార్మెన్స్ ఎలా ఉందొ మళ్ళీ ఆ రేంజ్ పెరఫార్మెన్స్ రాశి తొలిప్రేమలో కనబర్చింది. మరి రాశి చేసిన వర్ష పాత్రకి అటు ప్రేక్షకులతో పాటు ఇటు క్రిటిక్స్ సైతం ఫుల్ మార్కులు వేసేసారు. ఇక ఈ సినిమాతో రాశి ఖన్నా కి లక్కు కలిసొచ్చేలా కనబడుతుంది కూడా

Similar News