ఈ దసరా బరిలో రెండు బడా సినిమాలు ఉన్నాయి. దసరా సెలవలు మొదలవడంతోనే... అంటే సెప్టెంబర్ 21 నే ఎన్టీఆర్ 'జై లవ కుశ'తో సందడి చెయ్యడానికి వచ్చేస్తున్నాడు. దసరాకి ఒక వారం ముందుగా హడావిడి చేస్తున్న ఎన్టీఆర్... 'స్పైడర్' చిత్రం విడుదల టైంకల్లా.... వీలైనంత కలెక్షన్స్ కొల్లగొట్టేయ్యాలని చూస్తున్నాడు. దీనికి తగ్గట్టే 'జై లవ కుశా'ని ఆగమేఘాల మీద కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధం చేసేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాశి ఖన్నా, నివేత థామస్ లతో రొమాన్స్ చేస్తున్నాడు. అలాగే తమన్నా తో ఐటెం లో అదరగొట్టే స్టెప్పులు వేయనున్నాడు.
ఇక మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' చిత్రంతో తెలుగు, తమిళంలో ఈ దసరాకే రాబోతున్నాడు. 'జై లవ కుశ' విడుదలయ్యాక సరిగ్గా వారానికి అంటే ఈ నెల 27 న దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటెలీజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మురుగదాస్ ఏడాది కాలం నుండి చెక్కి చెక్కి ఎట్టకేలకు విడుదలకు సిద్ధం చేసాడు. ఈ చిత్రంలో మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ 'స్పైడర్' లో డాక్టర్ గా కనబడుతుంది.
ఇకపోతే 'జై లవ కుశ, స్పైడర్' చిత్రాల్లో కామన్ పాయింట్ అన్నట్టు ఇప్పుడు ఆ రెండు చిత్రాల రొమాంటిక్ ఫోటోలు మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్, రాశి ఖన్నాతో సూపర్ హాట్ గా రొమాన్స్ కి దిగడమే కాదు... మరో భామ నివేత థామస్ తో కూడా పిచ్చ రొమాంటిక్ గా రెచ్చిపోతున్నాడు. జై గా రాశి ఖన్నా తో రొమాన్స్, లవ గా నివేత థామస్ తో రొమాన్స్ చూస్తుంటే ఎన్టీఆర్ సామాన్యుడు కాదనిపించేలా ఉన్నాయి. ఇక మహేష్ కూడా ఇప్పటివరకు సోలో లుక్ తోనే అదరగొట్టేసాడు. ఇప్పుడు రకుల్ తో రొమాన్స్ చేసే లుక్ లో ఆహా అనిపిస్తున్నాడు. మహేష్ - రకుల్ రొమాంటిక్ లుక్ అదిరిపోతోంది. మరి 'జై లవ కుశ, స్పైడర్' చిత్రాలు రెండూ వేటికవే రొమాంటిక్ యాంగిల్ లో రెచ్చిపోతున్నాయి. ఆ లుక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.