పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాత వాసి సినిమా సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 10న విడుదల చేస్తున్నారు .ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి . పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కి వస్తానని ప్రకటించిన తరువాత వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ట్రయిలర్ విడుదలై రికార్డు క్రియేట్ చేస్తుంది . అయితే ఈ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఏది అడిగినా చంద్ర బాబు కాదనకుండా ఇచ్చి అతనితో మిత్రత్వం కొనసాగిస్తున్నాడు . వచ్చే ఎన్నికల్లో బాబు.... పవన్ సహకారం ఆశిస్తున్నాడు.
అందుకే అజ్ఞాత వాసి సినిమాకు విడుదలైన దగ్గరనుండి అర్ధరాత్రి ఆటలకు అనుమతి మంజూరు చేయించాడు. మాములుగా ఏ సినిమా విడుదలైన నాలుగు ఆటలు ఉంటాయి. ఈ నాలుగింటికి తోడు మరో మూడు ఆటలు ప్రదర్శించుకోడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పవన్ అజ్ఞాతవాసికి అనుమతి ఇచ్చేసింది .10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అజ్ఞాతవాసి సినిమా ఆంధ్ర ప్రదేశ్ లో దుమ్ము దులిపేసుకుంటుంది. అసలే పండగ సీజన్, అందులో పవన్ కళ్యాణ్ సినిమా. నిర్మాత చిన బాబు పంట పండింది.
మరో సంగతి పవన్ కళ్యాణ్ తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కొత్త సంవత్సరం రోజు ప్రగతి భవన్ లో కలసి శుభాకాంక్షలు చెప్పాడు .ఇద్దరి మధ్య ఏకాంత చర్చలు కూడా జరిగాయి. వారి మాటల్లో అజ్ఞాతవాసి వచ్చే ఉంటుంది. ఇవ్వాళో రేపో తెలంగాణ ప్రభుత్వం కూడా అజ్ఞాత వాసి సినిమాకు అదనపు ఆటలకు అనుమతి ఇచ్చే అవకాశం వుంది . తెలుగు దేశం ప్రభుత్వం ఇచ్చేసింది కాబట్టి టీఅర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలా అజ్ఞాతవాసికి ఇచ్చే అవకాశం వుంది. నిజంగానే ఎవరి రాజకీయ ప్రయాజనాలు వారు కాపాడుకుంటారు కదా.. అందులో పెద్ద వింతేముంది.