రెండు ఒకచోటే కానిచ్చేస్తున్నాడు!!

Update: 2017-07-06 07:15 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లోనే కాక బుల్లితెర మీద కూడా బిజీ అయ్యాడు. బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' లో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ చిత్రాన్ని సెప్టెంబర్ 21 న విడుదల తేదీ ప్రకటించేశాడు. మరి ఈ లోపు సినిమాని దాదాపు కంప్లీట్ చేసెయ్యాలి. మరోవైపు బుల్లితెర మీద స్టార్ మా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చెయ్యబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన బిగ్ బాస్ ప్రమోస్ లో ఎన్టీఆర్ లుక్ అందరిని విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కోసం దాదాపు 70 రోజుల పాటు కేటాయించాల్సి వస్తుంది. అంటే..... ఈ రియాల్టీ షో కాన్సెప్ట్ ప్రకారం 70 రోజుల పాటు పార్టిసిపెంట్స్ అక్కడే అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సి ఉంటుంది. వీరితో పాటు జూనియర్ కూడా ఈ 70 రోజులు అక్కడే అందుబాటులో ఉండాలి. పూనేలో ఉన్న బిగ్ బాస్ భారీ సెట్ లో ఈ కార్యక్రమం షూటింగ్ జరుపుకోనుంది. మరి బిగ్ బాస్ కోసం ఎన్టీఆర్ అలా 70 రోజులు బయటికెళితే ఇక్కడ 'జై లవ కుశ' పరిస్థితి ఏమిటని అందరికి డౌట్ వచ్చేస్తుంది కదూ..

మరి బిగ్ బాస్ కోసం పిలిచినప్పుడు వచ్చేందుకు వీలుగా ఎన్టీఆర్ ఖచ్చితంగా పూనేలోనే ఉండాలి. మరో వైపు 'జై లవ కుశ' రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఎన్టీఆర్ అండ్ టీమ్ 'జై లవ కుశ' ఒక ప్లాన్ చేసిందట. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'జై లవ కుశ' చిత్రం ఎన్టీఆర్ బిగ్ బాస్ కోసం పూనే కి వెళ్లగానే 'జై లవ కుశ' చిత్ర యూనిట్ కూడా పూనే కి పయనమవనుందట. అక్కడే పూనే లో మరికొన్ని రోజులు షూటింగ్ చెయ్యనున్నారట. అయితే కేవలం ఎన్టీఆర్ కోసమే 'జై లవ కుశ' షూటింగ్ పూనే షిఫ్ట్ అవుతుందని చెబుతున్నారు.

మరి ఎన్టీఆర్ ఒకే టైంలో ఒక పక్క వెండితెర ని మరోపక్క బుల్లితెరను కూడా దున్నేయ్యనున్నాడన్నమాట.అదండీ ఎన్టీఆర్ కమిట్మెంట్ అంటే.

Similar News