వెండితెర పై గ్లామర్ ఒలకబోసే భామల స్పూర్తితో నేటి తరం బుల్లి తెర యాంకర్ లు కూడా కురచ దుస్తులలో దర్శనమిస్తూ అందాల ఆరబోత విషయంలో వెండితెరకి బుల్లితెరపై తరతరాలుగా ఉన్న దూరాన్ని చేరువ చేసేశారు. వెండితెర పై గ్లామర్ షో చేసే హీరోయిన్స్ శ్రమ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడి అటు ఇటు కావచ్చు ఏమో కానీ బుల్లి తెరపై యాంకర్స్ అందాల ప్రదర్శనలకు మాత్రం టి.ఆర్.పి రేటింగ్స్ వారం వారానికి పెరుగుతూనే వున్నాయి. ఇలా బుల్లితెరపై తన హవా చాటిన ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ముందుగా వెండితెరపై నటిగానే కెరీర్ ప్రారంభించింది.
హోలీ చిత్రంలో సునీల్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటించిన రష్మీ తరువాత అక్కినేని నాగార్జున నిర్మించిన టెలి సిరీస్ యువ తో పాపులరై, వెండితెరపై కరెంటు, గుంటూరు టాకీస్, అంతం వంటి చిత్రాలలో మెరిసింది. కాగా జబర్దస్త్ షో ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని ఒప్పుకుని యాక్టింగ్ కెరీర్ ని చేతులారా కష్టాలలోకి నెట్టుకుంది రష్మీ. దానితో అమ్మడి పరిస్థితి వెండితెరకి బుల్లితెరపై మధ్య నలిగిపోతున్న గాలిపటం లా మారింది. అయితే ఇంకా యాక్టింగ్ పై మమకారం చంపుకోలేక ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటో షూట్స్ తో దర్శక నిర్మాతలకి తన గ్లామర్ డోస్ తో ఆకర్షిస్తూనే వుంది. అయితే ఇంత కాలం ఈ పని కురచ దుస్తులతో చేసిన ఈ హాట్ యాంకర్ ఇప్పుడు కొద్దిగా రూటు మార్చి వింతైన చీరకట్టులో దర్శనమిచ్చి తాజా ఫోటో షూట్ కి కొత్త అందాన్ని తెచ్చింది. పెదాలపై చిరునవ్వు, నడుము పై చేతి తో చీర కట్టులో కూడా ఆకర్షించగలనని ఈ ఫొటోతో చెప్పకనే చెప్తుంది రష్మీ గౌతమ్.