సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'టైగర్ జిందా హై'. ఈ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
సల్మాన్ నుండి ఎప్పుడు సినిమా వచ్చిన దాని పై హై ఎక్సపెక్టషన్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు ఈ సినిమాపై కూడా అంతకు మించి అంచనాలున్నాయన్నది నిర్వివాదాంశం. అయితే, 'రికార్డుల' విషయంలో సల్మాన్‌ఖాన్ కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాడిప్పుడు. అప్పట్లో 'ట్యూబ్‌లైట్' సినిమా ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు.... 'బాహుబలి' వసూళ్ళను దాటేస్తాం.. అని ధీమా వ్యక్తం చేశాడు సల్మాన్ ఖాన్. అయితే ఇప్పుడు మాత్రం, వసూళ్ళ ఊసెత్తడంలేదు. రికార్డ్స్ గురించి మాట్లాల్సి వస్తే.. నో కామెంట్స్ అంటున్నాడు.
తాజాగా ప్రొమోషన్స్ కోసం వచ్చిన సల్మాన్.. 'సినిమా వచ్చేస్తోంది.. ప్రీ రిలీజ్ అంచనాలకు ఆకాశమే హద్దు.. సీజన్ కూడా కలిసొస్తుంది. ఖచ్చితంగా మంచి వసూళ్ళనైతే సాధిస్తాం. రికార్డుల గురించి మాత్రం మాట్లాడను అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.