రాశి ఖన్నా కి తెలుగులో ఓ అన్నంత ఆఫర్స్ లేకపోయినా.. తమిళంలో మాత్రం అవకాశాలతో పర్లేదనిపిస్తుంది. జై లవ కుస సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో కలిసి తొలిప్రేమ లో నటిస్తునం రాశి ఖన్నా తమిళ్ లో హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉంది. అక్కడ తమిళంలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగానే... ఆమెకు మరో లక్కీ చాన్స్ వచ్చేసినట్టు తెలుస్తోంది. ఆ ఛాన్స్ మరెవరితోనో కాదు. జయం రవి సరసన రాశి ఖన్నా అవకాశం కొట్టేసినట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి.
అయితే జయం రవితో నటించిన ఏ హీరోయిన్ అయినా ఇప్పటివరకు తమిళ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగినవారే ఉన్నారు. ఇప్పుడు జయం రవితో తన నెక్స్ట్ సినిమా చేసేందుకు రాశీ ఖన్నా రెడీ అయిపోయిందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం రాశీఖన్నా తమిళ్ లో ఇమైకా నోడిగళ్ సినిమాలో హీరో అధర్వ తో కలిసి నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం జయం రవి, శక్తి సౌందరరాజన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా పూర్తి కావొచ్చింది. ఇక తన కొత్త సినిమాగా.. సుందర్ సి దర్శకత్వంలో భారీ చరిత్రాత్మక చిత్రం చేసేందుకు జయం రవి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఆ సినిమాలోనే జయం రవికి జోడిగా రాశీఖన్నాను హీరోయిన్ గా ఎంపిక చేశారంటున్నారు . ఇక డేట్స్ కూడా సర్దుబాటు చేసేందుకు రాశీఖన్నా రెడీ అవుతోంది. ఇలా ఉన్నట్టుండి లక్కీ హీరోతో చాన్స్ రావడంతో.. రాశి కూడా ఫుల్ హ్యాపీ గా ఉందట. అయితే ఈ విషయాన్నీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఈ సినిమా చారిత్రక కథాంశం అని తెలుస్తుండడంతో.. రాశీఖన్నా ఇందులో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందా అని అప్పుడే అంచనాలు కూడా మొదలయ్యాయి.