రాశి ఖన్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి ఒక మాదిరి హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చింది.రవితేజతో 'బెంగాల్ టైగర్' వంటి చిత్రాల్లో నటించిన రాశి ఖన్నా కి మొదటిసారి ఒక స్టార్ హీరో పక్కన ఛాన్స్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'జై లవ కుశ'లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రాశి ఖన్నా చేతిలో ఇప్పుడు చాలా సినిమాలే ఉన్నాయి. రవితేజతో మరొక్కసారి 'టచ్ చేసి చూడు' లో నటిస్తున్న రాశి... మెగా హీరో వరుణ్ తేజ్ పక్కన ఒక సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా మలయాళం సినిమాలో కూడా రాశి ఖన్నా ఒక అవకాశం అందిపుచ్చుకుంది.
ఇక రాశి నటించిన 'జై లవ కుశ' చిత్రం వచ్చే గురువారం విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో రాశి అందాలా ఆరబోత మాములుగా లేదు. ఫుల్ గా మోడరన్ గా రెచ్చిపోతున్న ఈ భామ ఇప్పుడు రవితేజ - అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న 'రాజా ది గ్రేట్' సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అది ఐటెం సాంగ్ కాదు కేవలం గెస్ట్ రోల్ అంటూ రాశి ఖన్నా ఫుల్ గా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. తన అభిమాన దర్శకుడు అనిల్ రావిపూడి కోసమే తాను 'రాజా ది గ్రేట్' లో ఒక క్యామియో రోల్ చేయబోతున్నట్లుగా చెబుతుంది.
మరి అని రావిపూడి దర్శకత్వంలో అమ్మడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి 'సుప్రీం' సినిమాలో నటించింది. అందుకే ఇప్పుడు ఆ డైరెక్టర్ మీదున్న అభిమానంతోనే ఆయన దర్శకత్వంలో రాబోతున్న 'రాజా ది గ్రేట్' లో కొద్దిసేపు మెరవబోతుందన్నమాట.