మణి రత్నం తో సినిమా చెయ్యాలి అంటే ఆ హీరోకి అదృష్టం ఉండాలి అనుకునేవారు ఒకప్పుడు ఆయనతో పనిచెయ్యడమంటేనే లైఫ్ టైం ఛాన్స్‌గా భావిస్తారు కొందరు హీరోలు. మణిరత్నం సినిమాల్లో ఉండే పాత్రలకు అంత బలం ఉంటుంది. అంత పాపులారిటీ ఉన్న డైరెక్టర్ మణిరత్నం కి వరుస ప్లాపులు వెంటాడడంతో ఇప్పుడు ఆయనతో సినిమా అంటేనే హీరోలు ఆలోచించుకునే స్థాయికి వచ్చేసారు. మొన్నామధ్యన వచ్చిన చెలియా కూడా ఘోరమైన ప్లాపవడంతో మణితో సినిమా చెయ్యడానికి టాప్ హీరోలు జంకుతున్నారు.
ఆ లిస్ట్ లో ఫస్ట్ రామ్ చరణే ఉన్నాడు. రామ్ చరణ్ - మణిరత్నం కాంబినేషన్ లో ఒక మూవీ సెట్స్ మీదకెళ్లబోతుందంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, మణి డైరెక్షన్ లో నటిస్తాడని అనుకున్నప్పటికీ చెలియా డిజాస్టర్ తో చరణ్ వెనుకడుగేసాడు. అందుకే కొరటాలతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఆఫీసియల్ గా స్టార్ట్ చేసి మణికి షాక్ ఇచ్చాడు. కాకపోతే మణి ఇంకా చరణ్ కోసం ట్రై చేస్తున్నట్టు... ఆ సినిమా కోసమే నటీనటుల ఎంపిక చేస్తున్నట్టు మొనమధ్యన సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. కానీ అవి కేవలం గాసిప్స్ మాత్రమే అని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు రామ్ చరణ్ ని మణిరత్నం లైట్ తీసుకుంటున్నాడు. అందుకే మణి రత్నం ఇప్పుడు ఒక కోలీవుడ్ హీరోతో సినిమా మొదలెట్టబోతున్నాడు. విలక్షణమైన సినిమాలతో.. అద్భుతమైన పాత్రలతో.. అదిరిపోయే నటనలతో గత కొన్నేళ్లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన విజయ్ సేతుపతి మణిరత్నం కొత్త సినిమాలో హీరో గా నటించబోతున్నాడంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మణి రత్నం, విజయ్ సేతుపతి ల కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అంటూ కోలీవుడ్ లో కథనాలు ప్రచారమవుతున్నాయి. ఇక ఈ సినిమాకి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించబోతున్నాడని... ఇక సినిమాకి సంగీతం ఎ.ఆర్.రెహమాన్ అందించబోతున్నాడంటూ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. చూద్దాం ఏ సినిమా ఎప్పుడు పట్టాలెక్కపోతుందో!!