రామ్ చరణ్ ‘తప్పెట గుళ్ళు’ కబుర్లు

Update: 2017-12-21 04:48 GMT

రామ్ చరణ్ – సుకుమార్ కలయికలో వస్తున్న ‘రంగస్థలం-1985’ చిత్రానికి సంబందించిన వార్తలు రోజురోజుకు ఆ చిత్రం పై ఆసక్తిని పెంచేస్తున్నాయి. అందులోను 'రంగస్థలం' లోని రామ్ చరణ్ గెటప్, సమంత గెటప్స్ కూడా ఆసక్తిని కలిగించేలాగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం కోసం 12 కోట్లతో పల్లెటూరి సెట్ ను నిర్మించిన చిత్ర బృందం.... చిత్రంలో అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉండేటట్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఈ సెట్ లో ప్రతీ చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకున్నారు.

మార్చి 29న విడుదల కాబోతున్న ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్ లోనే ఈ చిత్రం చిత్రీకరణ సాగుతుంది. అయితే బుధవారం జానపద ఆట ‘తప్పెట గుళ్ళు ‘కు సంబంధించిన సీన్ లను చిత్రీకరణ జరిపింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ చిత్రంలో నటించిన నిజమైన తప్పెట గుళ్ళు నాట్యకారులతో దిగిన ఫోటోను చిత్ర కథానాయకుడు రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్న్నాడు. 'రంగస్థలం' సెట్ లో మరో రోజు చిత్రీకరణ, మరో జానపద ఆటకు సంబంధించిన విషయాల్ని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. ‘తప్పెట గుళ్ళు’ నాట్యానికి సంబంధించిన ఆటగాళ్ళని కలిసాను' అంటూ రామ్ చరణ్ ఆ ఫోటోను షేర్ చేసాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, ఆదిపినిశెట్టి మొదలుగు వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Similar News