సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985 ' చిత్రం పక్కా పల్లెటూరి చిత్రంగా తెరకెక్కుతుంది. సినిమా అంతా ఆనాటి అంటే 1980 - 1990 లో ఉండే వాతారవరణంతోనే ఉంటుందన్నమాట. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా... అనసూయ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ అంటూ బయటికి ఏమి తెలియనివ్వడం లేదు. ఈ సినిమాని జనవరి లో సంక్రాతి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ చెప్పినప్పటికీ డేట్ క్లారిటీ లేదు. ఈలోపు పవన్ 'అజ్ఞాతవాసి', బాలకృష్ణ 'జై సింహ' లు సంక్రాతికి బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకోవడంతో రామ్ చరణ్ వెనుకడుగేశాడనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా 'రంగస్థలం' మార్చి కి వెళ్లిందని ప్రచారం కూడా జరిగింది.
అయితే జనవరి 10 కి తన బాబయ్ సినిమా వస్తుంది కాబట్టి.. అప్పుడు కాకూండా కాస్త గ్యాప్ తీసుకుని చరణ్ తన సినిమాని విడుదల చేద్దామనుకుంటే రజినీకాంత్ '2.0 ' జనవరి నెలాఖరున విడుదలవుతున్నట్టుగా మొన్నామధ్యన మేకర్స్ ప్రకటించారు. అందుకే చరణ్ కి కరెక్ట్ గా డేట్ సెట్ కాక తలా పట్టుకున్నాడు. ఈలోపు '2.0 ' జనవరి ఆఖరినుండి ఏప్రిల్ 13 కి పోస్ట్ పోన్ అయ్యింది. గ్రాఫిక్ వర్క్ పూర్తిగా కంప్లీట్ కాకపోవడంతో ఏ సినిమాని జనవరినుండి ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేశారు. మరి చరణ్ తన బాబాయ్ పవన్ 'అజ్ఞాతవాసి' వచ్చిన 15 రోజులకి అంటే.. రిపబ్లిక్ డే కి విడుదల చేసుకుంటే బావుంటుంది.
కానీ 'రంగస్థలం' దర్శకుడు సుకుమార్ ఇంకా సినిమాని చెక్కుతూనే ఉన్నాడు. ఈలోపు చరణ్ డైరెక్టర్ కి డెడ్ లైన్ పెట్టినట్లుగా వార్తలొకటి. నవంబర్ కల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ చేయకపోతే ఇక డేట్స్ ఇవ్వనని చరణ్... సుకుమార్ కి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి రామ్ చరణ్ కాస్త పూనుకుని జనవరి చివరి వారంలో తన 'రంగస్థలం' ని దింపితే సేఫ్ అవుతాడు. చూద్దాం... చరణ్ ముందడుగేసే లోపు ఇంకెవరు ఆ డేట్ కి వెళ్లకుండా ఉంటె బావుంటుంది. లేకుంటే చరణ్ మరో డేట్ వెతుక్కోవాలి.