రామలక్ష్మి వచ్చేసిందోచ్

Update: 2018-02-09 09:00 GMT

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ - సమంత జంటగా రంగస్థలం షూటింగ్ పూర్తికావొచ్చింది. మరి సినిమా షూటింగ్ మొదలెట్టుకున్న ఏడాదికి గాని విడుదలకు సిద్దమవని ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనూ, రంగస్థలం టీజర్ తోనూ భారీ హైప్ ని క్రియేట్ చేసింది సుకుమార్ అండ్ టీమ్. నిన్నగాక మొన్న చిట్టిబాబు అంటూ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ లోను టీజర్ లోను చించి ఆరేస్తే... ఇప్పుడు రామలక్ష్మిగా సమంత అదరగొడుతుంది. రామ్ చరణ్ ని సోలోగా పెట్టి రంగస్థలం టీజర్ ని కట్ చేసిన సుకుమార్ ఇప్పుడు రామలక్ష్మి అంటే సమంతని సోలోగా దించాడు. చిట్టిబాబుగా సౌండ్ ఇంజినీర్ గా రామ్ చరణ్ ని పక్కా మాస్ కాదు కాదు ఊర మాస్ మాదిరిగా లుంగీ, చొక్కా, కండువాతో మెగా ఫాన్స్ ని ఉర్రుతలూగిస్తే... ఇప్పుడు సమంత రామలక్ష్మీగా పాతకాలపు పరికిణి ఓణీ, డొక్కు సైకిల్, తల మీద మొక్కజొన్న చొప్ప తో అదరగోట్టేసింది.

ఎప్పుడు మోడరన్ డ్రెస్సుల్లో అదరగొట్టే నవ్వుతో గ్లామర్ గా ఉండే సమంత... రంగస్థలం కోసం డి గ్లామర్ లుక్ లోకి మారినా ఆమె మొహంలో కళ గాని, నవ్వు గాని చేరగలేదు. ఎంత మేకప్ లేకపోయినా సమంత లుక్స్ చాల బావున్నాయి రంగస్థలంలో. ఇకపోతే ఈ రంగస్థలం టీజర్ లో సమంత వయ్యారంగా తిప్పుకుంటూ బింది తీసుకొని నీళ్ల కోసం వెళుతుంటే... బ్యాగ్రౌండ్ లో చిట్టి అదేనండి రామ్ చరణ్.... ఓహోహో .. ఏం వయ్యారం ఏం వయ్యారం.. ఏమాటకామాటే సేప్పుకోవాలండి.. ఈ పిల్లేదురోత్తంటే మన ఊరికే పద్దెనిమిది సంవత్సరాలు వయసొచ్చినట్టు ఉంటదండి.... సైకిల్ మీద అలా అలా రామలక్ష్మి వస్తుంటే... మళ్ళీ బ్యాగ్రౌండ్ లో చిట్టి బాబు... ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెత్తించేసింది ఈ పిల్లేనండీ... పేరు రామలక్ష్మి అండి....ఊరు రంగస్థలమండి అని చెబుతుంటే సమంత నవ్వుతుంది చూడండి గుండె లయ తప్పాల్సిందే. అలాగే టీజర్ చివర్లో సమంత బట్టలుతుకుతూ పెట్టిన ఫోజుంది చూడండి అమ్మో కేక.

మరి చిట్టిబాబే కాదు రామ లక్ష్మి కూడా రంగస్థలంతో అదిరిపోయింది. మంచి కథ ఉంది కాబట్టే ఇలాంటి డి గ్లామర్ లుక్స్ కి అటు రామ్ చరణ్, ఇటు సమంత ఓకె చెప్పింది. ఇక దర్శకుడు సుకుమార్ ఈసారి డిఫ్రెంట్ గా స్టయిల్ మార్చాడనేది పూర్తిగా అర్ధమయ్యింది. అలాగే దేవిశ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అనిపించేలా ఉంది. మరి మార్చ్ 30 న మెగా ఫాన్స్ కాసుకోండి పండగ చేసుకోవడానికి.

Similar News