వేసవి సెలవులు ముగిసిపోయి రెండు నెలలు కావొస్తుంది....జూన్ లో, జులై లో చిన్న చితక సినిమాలు విడుదల అయినప్పటికీ మిగతా పెద్ద సినిమాలన్నీ ఆగష్టు లో విడుదలకు రెడీ అవుతుంటాయి. కారణం ఆ మంత్ లో ఎక్కువగా సెలవలు గట్రా వస్తే ఆ సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఉత్సహాం చూపిస్తుంటారు. శ్రావణ శుక్రవారం నుండి ఆగస్టు 15 వరకు మధ్యలో రాఖి పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి సెలవులతో ఎక్కువగా కలిసొస్తుంది కాబట్టే ఆగష్టు నెలలో సినిమాలన్నీ విడుదలకు సిద్దమవుతుంటాయి.. అందుకే ఇప్పుడు ఎక్కువగా ఆగష్టు 11 నుండి 15 వరకు వరుసగా నాలుగు రోజుల సెలవులను క్యాష్ చేసుకోవడానికి బోలెడు సినిమాలు పోటీ పడుతున్నాయి.
ఆగస్టు 11న ఇప్పటికే మూడు సినిమాలు రావడానికి డేట్ ఫిక్స్ చేసేసుకున్నాయి. ఆ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ కాకపోయినా.... బడ్జెట్ బాగానే ఎక్కించిన సినిమాలు కావడంతో ఇప్పుడు ఆగష్టు 11 న గట్టి పోటీ ఏర్పడింది. ముందుగా నితిన్ 'లై' సినిమాకి డేట్ కన్ఫర్మ్ చేస్తే తర్వాత అదే డేట్ ని బోయపాటి 'జయ జానకి నాయక, సినిమాకి సెట్ చేసుకున్నాడు. ఇక మూడోది తేజ డైరెక్షన్ లో రానా హీరోగా వస్తున్నా 'నేనే రాజు నేనే మంత్రి' కూడా ఈ ఆగష్టు 11 నే విడుదల తేదీ అంటున్నారు. మరి మూడు పెద్ద సినిమాలు ఒకేసారి బరిలోకి దిగితే మూడు సినిమాల టాక్ ఎలా వున్నా నష్టపోయేది మాత్రం మూడు సినిమాల నిర్మాతలు.
అందుకే ఆగష్టు 11 బరినుండి ఒక సినిమా తప్పుకోవడానికి రెడీ అయ్యిందంటున్నారు. ఇక ఈ బరి నుండి రానా వెనక్కి తగ్గుతున్నట్లు వార్తలోస్తున్నాయి. 'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసి ఫుల్ కంటెంట్ తో కాన్ఫిడెంట్ గా వున్న రానా సినిమా తగ్గడానికి కారణం థియేటర్స్ దొరక కాదు, సినిమా మీద డౌట్ ఉండి కాదు, కేవలం టెక్నికల్ ఇబ్బందులవల్ల రానా సినిమా వాయిదా పడచ్చని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. మరి ఆగష్టు 11 న వాయిదా వేసుకునే ఈ సినిమాని ఆగష్టు 25 న విడుదల చెయ్యొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఆగష్టు 11 న నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ దున్నేయ్యనున్నారన్నమాట. ఇక 25 న రానా సోలోగా హిట్టుకొట్టాలనే ప్లాన్ చేస్తున్నదంటున్నారు.