రానా వసూళ్లు చూసారా?

Update: 2017-08-28 09:00 GMT

తేజ డైరెక్షన్ లో రానా సోలో హీరోగా తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్టయ్యి కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టిన 'నేనే రాజు' చిత్రం నిర్మాతలకు లాభాలు పంట పండిస్తోంది. ఈ సినిమా 11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి... ఇప్పుడు దాదాపు 25 కోట్లు కొల్లగొట్టిందనే టాక్ బయటికి వచ్చింది. ఇప్పటికే ఈ లాభాల్లో వాటా కింద తేజ 5 కోట్లు, రానా 5 కోట్లు, నిర్మాతలు 5 కోట్లు తీసుకున్నట్టు వార్తలు ఉండనే ఉన్నాయి. తేజకి రానాకీ లాభాల్లో వాటా ఎందుకంటే వారిద్దరూ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమా లాభాల్లో 25 పైసల వాటాకి పనిచేశారు... సో అలా వారు చెరో ఐదు కోట్లు తీసుకున్నారు. ఇక 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం పొలిటికల్ సెంటిమెంట్ డ్రామాగా తెరకెక్కి మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈ మూవీ.. వినాయకచవితి వీకెండ్‌తో 25 కోట్ల షేర్ మార్క్ అందుకోనుందని ట్రేడ్ టాక్.

2 వారాల 'నేనే రాజు నేనే మంత్రి' వసూళ్లు ఏరియాల వారీగా:

నైజాం : 7.85 కోట్లు

ఉత్తరాంధ్ర : 2.62 కోట్లు

సీడెడ్ : 2.5 కోట్లు

ఈస్ట్ : 1.70 కోట్లు

గుంటూరు : 1.42 కోట్లు

కృష్ణ : 1.39 కోట్లు

వెస్ట్ : 92 లక్షలు

నెల్లూరు : 55 లక్షలు

టోటల్ నైజాం + ఆంధ్రప్రదేశ్ : 18 కోట్ల 95 లక్షలు

వరల్డ్ వైడ్ : 23 కోట్ల 50 లక్షలు వసూలు చేసి మంచి లాభాలు కొట్టేసింది. అలాగే ఆగష్టు 11 న మరో రెండు చిత్రాలతో పోటీపడి మరీ ఈ 'నేనే రాజు నేనే మంత్రి' ఇంతటి వసూళ్లు సాధించిందని చెబుతున్నారు.

Similar News