రానా గారు డిమాండ్ బాగానే వుంది

Update: 2017-09-23 10:39 GMT

బాహుబలి భళ్లాలదేవా, నేనే రాజు నేనే మంత్రి జోగేంద్ర అంటూ అదరగొట్టిన రానా ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రానాకి ఇప్పుడు అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ వచ్చేసింది. విలన్ గా, హీరోగా వెలిగిపోతున్న రానా ఇప్పుడు తన మార్కెట్ పరిధిని పెంచుకునే యోచనలో భాగంగా నేనే రాజు నేనే మంత్రి ని పక్క రాష్ట్రం తమిళనాట కూడా విడుదల చేసాడు. అంతేకాకుండా తనకు ఫెమ్ ఉన్నంతవరకే డబ్బు సంపాదన ఉంటుందని గ్రహించిన రానా ఇప్పుడు షాప్ ఓపెనింగ్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించేస్తున్నాడు.

ఒకవైపు వ‌రుస‌గా సినిమాల‌కు సైన్ చేస్తూనే... మరోవైపు కంపెనీల వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌కు సంత‌కాలు చేస్తున్నాడు. షాపులు, మాల్స్ ఓపెనింగులు, రిబ్బ‌ను క‌టింగుల‌తో బోలెడంత డబ్బును ఆర్జిస్తున్నాడు. ఇక షాప్ ఓపినింగ్స్ కి అయితే రానా కేవలం 10 నుండి15 నిమిషాలకు గాను 10 నుండి 15 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. రానా ఒక్కో షాపు ఓపెనింగుకు కేవ‌లం ప‌ది నిమిషాల అప్పియ‌రెన్స్‌కు 15 ల‌క్ష‌ల మేర డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. భళ్లాలదేవుడిగా గా వ‌చ్చిన గుర్తింపు రానాకు బాగా వ‌ర్క‌వుట‌వుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు

Similar News