గత శుక్రవారం విడుదలైన రాజుగారి గది 2 చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలోని నాగార్జున నటనకు, ఆత్మగా నటించిన సమంత నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక ఈ చిత్రం కలెక్షన్స్ లోను అదరగొట్టేస్తుంది అంటున్నారు కానీ మరొకపక్క కలెక్షన్స్ అంతగా లేవనే టాక్ కూడా వినబడుతుంది.. ఈ చిత్రం విడుదలై రెండు రోజులు పూర్తి చేసుకుంది. ఈ రెండు రోజుల రాజుగారి వసూళ్లు ఫరవాలేదనిపించినా కొన్ని ఏరియాల్లో ఇంకా లక్షల్లోనే కలెక్ట్ చెయ్యడం బయ్యర్స్ ని టెన్షన్ పెడుతోందని టాక్. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4 కోట్లు వసూలు చేసిన రాజుగారి గది 2 రెండో రోజు రెండున్నర కోట్లకు పైగా షేర్ సాధించినట్టు తెలుస్తోంది. దీనిబట్టి రాజుగారి గదికి ఆశించినంతగా వసూళ్లు లేవనే టాక్ వినిపిస్తోంది. ఇక రాజుగారి గది రెండు రోజులఏరియాల వారీ వసూళ్లు ఇలా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాలావారీగా రాజుగారి గది 2 కలెక్షన్స్
నైజాం: 2.71 కోట్లు
సీడెడ్ : 91 లక్షలు
ఉత్తరాంధ్ర : 77 లక్షలు
గుంటూరు : 67
ఈస్ట్ గోదావరి : 56
కృష్ణా : 48
పశ్చిమ గోదావరి : 41
నెల్లూరు : 22
మొత్తం : 6 కోట్ల 73 లక్షలు