తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత శుక్రవారం ముగ్గురు హీరోలు ముక్కోణపు ఫైటింగ్ కి దిగారు. నితిన్ 'లై', రానా నేనే రాజు నేనే మంత్రి', బెల్లంకొండ శ్రీనివాస్ 'జయ జానకి నాయక'లతో థియేటర్స్ లో పోటీపడ్డారు. అయితే ముగ్గురిలో పై చెయ్యి మాత్రం రాజుతో రానా సాధించాడని మొదటి ఐదు రోజుల కలెక్షన్స్ చెబుతున్నాయి. గత వారం విడుదలైన మూడు సినిమాల్లో 'నేనే రాజు నేనే మంత్రి' మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించి ముందంజలో నిలిచింది. 13 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో తీసిన రానా మూవీ.. ఐదు రోజుల్లోనే దాదాపు 17 కోట్లు షేర్ దక్కించుకుని ప్రాఫిట్ జోన్ లో చేరిపోయింది. ఏపీ - తెలంగాణ షేర్ 13.57 కోట్లు, వరల్డ్ వైడ్ షేర్ 16.45 కోట్లు (షేర్) సాధించి విజయకేతనం ఎగురవేసింది.
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'జయ జానకి నాయక' రెండో స్థానంలో నిలిచింది. కాకపోతే 'జయ జానకి నాయక'కి పెట్టిన పెట్టుబడిలో మూడో వంతు కూడా కలెక్ట్ చెయ్యలేక చేతులేత్తిసిందనే టాక్ వినబడుతుంది. 45 కోట్ల బడ్జెట్ పెట్టి 'జయ జానకి నాయక'ని తెరకెక్కిస్తే.. ఐదురోజుల్లో వసూలైన వరల్డ్ వైడ్ షేర్ 14.4 కోట్లు మాత్రమే. అమెరికాలో అయితే బోయపాటి అడ్డంగా బోల్తా పడ్డాడు. అక్కడ బోయపాటి మార్క్ జయజనాకిని ఏ మాత్రం సేవ్ చెయ్యలేకపోయింది. ఇక అమెరికా షేర్ 20 లక్షలయితే, కర్ణాటకలో ఒక మోస్తరుగా 75 లక్షలు కలెక్ట్ చేసింది. మరి జయ జానకి సినిమాలో కీలకం అయిన క్లైమాక్స్ ఫైట్ తీసిన హంసలదీవి లొకేషన్స్ లో ఈ రోజు గురువారం 'జయ జానకి నాయక' సక్సెస్ సంబరాలను జరుపుకోబోతుంది చిత్ర యూనిట్.
ఇక మిగిలిన మూడో చిత్రం 'లై' మాత్రం నితిన్ కి నష్టాలనే తెచ్చి పెట్టింది. విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం చాలా వీక్ గా వున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ - తెలంగాణాలో కలిపి ఇప్పటివరకూ షేర్ 8 కోట్లు కూడా దాటలేదని టాక్ వినబడుతుంది. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ' లై' మూవీ టోటల్ గా బాగానే నష్టాలు చవి చూసింది