రాజీపడి తన విలువ పెంచుకున్న అగ్ర హీరో

Update: 2018-01-21 16:06 GMT

చలన చిత్ర పరిశ్రమ అంటేనే పోటీ ప్రపంచం. నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల పని తీరు ల విషయాలలో ఈ పోటీ అంతర్లీనంగా కొనసాగుతూ పైకి ఆరోగ్యకర స్నేహం అనే ముసుగు తొడుక్కుని ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే ఈ పోటీ ప్రత్యక్షంగా కనిపించేది మాత్రం సినిమాల విడుదల సమయం లోనే. ఒకే రోజు రెండు లేదా అంతకు మించిన సంఖ్యలో భారీ చిత్రాల విడుదలలు ఉంటే అది ప్రతి చిత్ర దీర్ఘకాలిక ప్రదర్శనలపై ప్రభావం చూపటం ఖాయం. కాగా ఈ నెల 25 న అక్షయ్ కుమార్ నటించిన పాడ్ మాన్ విడుదల చాలా కాలం క్రితమే ఖరారు ఐయింది. మరో వైపు సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం పద్మావత్ అనేక పర్యాయాలు రకరకాల వివాదాలలో చిక్కుకుని పలు మార్లు విడుదల వాయిదా కాబడింది.

అదృష్టవశాత్తు అన్ని కుదిరి ఈ నెల 25 న పద్మావత్ విడుదలకి లైన్ క్లియర్ ఐయింది. దానితో పాడ్ మాన్ మరియు పద్మావత్ ల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ తప్పదనే అనుకున్నారు అంతా. పద్మావత్ ఒకవేళ వాయిదా పడితే ఇంకెన్ని వివాదాలు చుట్టుకుని విడుదలలో ఇంకా జాప్యం జరిగే ప్రమాదం ఉండటంతో ఆ చిత్ర బంధం శ్రమ ని గౌరవిస్తూ చాలా కాలం ముందుగా రిలీజ్ డేట్ బ్లాక్ చేసుకున్నప్పటికీ సినిమా శ్రేయస్సు కోరుకుని అక్షయ్ కుమార్ తన చిత్రాన్ని రెండు వారాలకి వాయిదా వేసుకోవటం యావత్ బాలీవుడ్ ని కదిలించింది. ఆఫ్ స్క్రీన్ కూడా అక్షయ్ హీరోనే అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు బిటౌన్ జనాలు.

Similar News