రవితేజ తో దిల్ రాజు సినిమాని నిర్మించడానికి సిద్దమవగా... రవితేజ కున్న యావరేజ్ కెరీర్ ని చూసి దిల్ రాజు రవితేజతో బేరమాడాడనీ ... కానీ రవితేజ నా కెరీర్ లో ఎలాంటి ప్లాపులున్నా కూడా నేను మాత్రం పారితోషకం విషయంలో తగ్గేది లేదని... చెప్పడంతో దిల్ రాజు నిర్మాతగా రవితేజ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదనే న్యూస్ సోషల్ మీడియా సాక్షిగా హల్చల్ చేసింది. బెంగాల్ టైగర్ తర్వాత సినిమాలేమి చెయ్యకుండా ఖాళీగా వున్న కూడా తన పారితోషకాన్ని ఏమాత్రం తగ్గించకుండా 10 కొట్లమీదే కూర్చున్న కూడా.. ఆఖరికి కథ నచ్చి దిల్ రాజుగారు కొద్దిగా దిగొచ్చి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్' సినిమాని చేసాడు.
అంతేకాకుండా రవితేజ అడిగిన 10 కోట్లు చెల్లించే ఈ సినిమా నిర్మాణం చేపట్టాడనే టాక్ కూడా వుంది. మరి రవితేజ మార్కెట్ మీద అపనమ్మకంతోనే దిల్ రాజు ఈప్రాజెక్టు ని నిర్మించినప్పటికీ.... ఈ సినిమా విడుదల తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుని... థియేటర్స్ లో రన్ అవుతుంది. కామెడీతోనే సినిమాని హిట్ ట్రాక్ ఎక్కించిన అనిల్ రావిపూడి, తనకున్న ఎనర్జీతోనే సినిమాని నడిపించిన రవితేజని అందరూ ప్రశంసిచ్చేస్తున్నారు. ఇక దిల్ రాజుకి కూడా 'రాజా ది గ్రేట్' తో బాగానే గిట్టుబాటయ్యిందంటున్నారు. 'రాజా ది గ్రేట్' సినిమాకి శాటిలైట్ హక్కుల ద్వారా హిందీలో తెలుగులో కలిపి బాగానే వచ్చిందంటున్నారు.
'రాజా ది గ్రేట్' హిందీ డిజిటల్ శాటిలైట్ కి 7కోట్లు, తెలుగు శాటిలైట్ హక్కులకు 11కోట్లు వచ్చింది. అలాగే 'రాజా ది గ్రేట్' థియేటర్స్ రైట్స్ ద్వారా వరల్డ్ వైడ్ గా 18 కోట్ల మేరకు బిజినెస్ చేసిందట. మరి ఈ లెక్కన దిల్ రాజు కి రాజాకి పెట్టిన పెట్టుబడికంటే... ఐదారు కోట్లు మిగులుతాయంటున్నారు. పెట్టింది ముప్పై అయితే వెనక్కి వచ్చింది ముప్పైఆరు అంటూ చెబుతున్నారు. ఇక దిల్ రాజు దగ్గర ఉత్తరాంధ్ర హక్కులు, కృష్ణాలో కూడా కాస్త వాటా 'రాజా ది గ్రేట్' లో ఉండడంతో మరింత లాభం వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. పాపం మార్కెట్ లేదని ఆలోచనలో ఉన్న రాజుగారికి 'రాజా' బాగానే లాభాలు తెచ్చాడు.