మాస్ మహరాజ్ రవితేజ రెండేళ్ల గ్యాప్ తర్వాత చాలా లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా హిట్ కొట్టాడు. 2015 దీపావళికి బెంగాల్ టైగర్‌గా వచ్చిన రవితేజ నటించిన సినిమా తర్వాత ఏదీ రిలీజ్ కాకపోవడంతో జనాలు మనోడిని చాలా వరకు మర్చిపోయారు. రవితేజ కెరీర్ ముగిసిపోయిందన్న వాళ్లూ ఉన్నారు. అయితే తాజాగా రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవి తనతో ఎనర్జి ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేసుకున్నాడు.
దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో పాటు టాలీవుడ్‌లో పటాస్, సుప్రీమ్ లాంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కడంతో మంచి హైప్ వచ్చింది. రవితేజ ఫామ్‌లో లేకపోయినా క్రేజీ కాంబోలో రావడంతో రాజా ది గ్రేట్‌కు వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రైట్స్ + శాటిలైట్ + డిజిటల్ రైట్స్ కలుపుకుని రూ.40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇక బుధవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలోనే ఏకంగా రూ. 5 కోట్ల షేర్ రాబట్టి రవితేజ బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ చేసింది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.
రాజా ది గ్రేట్ ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్ :
నైజాం - 1.95 (రూ.కోట్లలో)
సీడెడ్ - 0.76
ఉత్తరాంధ్ర - 0.60
వెస్ట్ - 0.30
ఈస్ట్ - 0.40
కృష్ణా - 0.29
గుంటూరు - 0.50
నెల్లూరు - 0.22
---------------------------------------------------
ఏపీ+తెలంగాణ ఫస్ట్ డే షేర్ = 5.02 కోట్లు
---------------------------------------------------