సీనియర్ హీరో రాజశేఖర్ - శ్రద్ద దాస్, పూజ కుమార్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ‘పి.ఎస్.వి.గరుడవేగ 126.18 ఏఎం’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే గత రాత్రి అంటే శుక్రవారం రాత్రి ‘పి.ఎస్.వి.గరుడవేగ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కి నర్తించిన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఈ ఫంక్షన్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
అయితే ఈ వేడుకలో హీరో రాజశేఖర్ వేదిక మీద కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన అంతలా ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఈ సినిమా విడుదలకు ముందే ఆయన తల్లి కాలం చెయ్యడంతో.. ఈ ఈవెంట్ లో ఆయన అంతగా ఎమోషన్ అయ్యారు. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ కి సక్సెస్ అనేదే లేకుండా పోయింది. ‘పి.ఎస్.వి.గరుడవేగ' తో మళ్ళీ సక్సెస్ బాట పట్టాలని రాజశేఖర్ ఆశపడుతున్నారు. అయితే తనకు సక్సెస్ రావాలని తన తల్లి ఎంతగానో ఇదయ్యారని.. కానీ ‘పి.ఎస్.వి.గరుడవేగ' సినిమా విడుదల కాకుండానే ఆమె చనిపోవడంతో తన నెత్తిన పిడుగుపడిన ఫీలింగ్ వచ్చిందని చెప్పారు.
అలాగే తన బావమరిది మురళి కూడా తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నారని.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. కానీ సినిమా నిర్మాతలకు ఎటువంటి లాస్ రాకూడని భావించి ఈ ఫంక్షన్ కి అటెంట్ అయ్యానని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనదని.. ఈ సినిమా టీజర్ విడుదల చేసిన ఐదు రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ వచ్చాయని.. తెలిసినప్పుడు మా అమ్మ గారు నా దగ్గరే ఉన్నారని... తన కొడుక్కి చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయం దక్కుతుందని... చాలా సంతోషంగా కనిపించారు అని చెప్పడమే కాకుండా..... నేను సినిమాల్లో చాలా నష్టపోయానని మా అమ్మానాన్నలకు బాధ. నాకు సెట్ కానీ సినిమాల్లో నటించి చాలా ఆస్తులు కోల్పాయని చెప్పారు.