రాజమౌళి రంగస్థలం మ్యాటరేంటి?

Update: 2018-03-01 09:48 GMT

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ రంగస్థలం అనే సినిమా ని తెరకెక్కిస్తున్నాడు. పూర్తిగా పల్లె అందాలతో గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కి సంబందించిన మేజర్ షూట్ ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేసినప్పటికీ అక్కడ సరిగా షూటింగ్ సాగక పోవడంతో హైద్రాబాద్ శివార్లలో రంగస్థలం కోసం 12 కోట్ల ఖర్చుతో ఒక విలెజ్ సెట్ వేసి మరి రంగస్థలం షూటింగ్ చేసింది చిత్ర బృందం. చిట్టిబాబు గా రామ్ చరణ్, రామలక్ష్మి గా సమంత లు ఇద్దరూ పల్లెటూరి యువతి యువకుల్లా మెరిసిపోతున్నారు. అచ్చం పల్లెటూరి నుండి వచ్చారా అన్నట్టుగా చరణ్, సమంతల లుక్ ఉంది అంటే నమ్మాలి.

అయితే హైదరాబాద్ లో రంగస్థలం సెట్ వేసిన తర్వాత ఒకసారి దర్శక ధీరుడు రాజమౌళి, మెగాస్టార్ చిరు లు రంగస్థలం సెట్స్ ని సందర్శించి రామ్ చరణ్ ని, సుకుమార్ ని సర్ప్రైజ్ చేశారు. అప్పుడు రాజమౌళి, చిరు రంగస్థలం సెట్స్ లో సందడి చేసిన విషయం సుకుమార్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. అయితే తాజాగా మరోమారు రంగస్థలం సెట్స్ లో రాజమౌళి కనిపించాడు. రాజమౌళి రంగస్థలం సెట్స్ కి రావడంతోనే ఆ సినిమా దర్శకుడు సుకుమార్ రాజమౌళి ని వెంటబెట్టుకుని రంగస్థలం షూటింగ్ కబుర్లతో పాటే.... రంగస్థలం సెట్స్ మొత్తాన్ని తిప్పి చూపించాడు.

అయితే ఇప్పుడు అందరి అనుమానం రాజమౌళి పదే పదే రంగస్థలం సెట్స్ ని ఎందుకు సందర్శిస్తున్నాడు. గ్రామీణ వాతావరణం ఇలా సెట్స్ రూపంలో ఎలా ఉంటుందో చూడడానికి వస్తున్నాడా? లేకపోతె ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందట. అందుకు ఈ సెట్ ఏవైనా ఉపయోగపడుతుందా అనే విషయాన్ని పరిశీలించడం కోసమే రాజమౌళి మళ్లీ అక్కడికి వెళ్లి రంగస్థలం సెట్ ని అణువణువునా పరిశీలించాడా అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. చూద్దాం రాజమౌళి రంగస్తలం మ్యాటర్ ఏమిటనేది.

Similar News