రాజమౌళి మల్టీస్టారర్ లో కిక్ ఇచ్చే రూమర్

Update: 2018-02-05 05:15 GMT

బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి తీస్తున్న చిత్రం ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల మల్టీస్టారర్. ఈ సినిమా గురించి టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ శర వేగంగా జరుగుతుంది.

ఈ సినిమా అనుకున్న దగ్గర నుండి ఏదొక వార్త బయటకు వచ్చి హల చల్ చేస్తుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా రవి తేజ నటిస్తున్నాడని వార్త బయటికోచ్చింది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ లోపే మరో రూమర్ బయటకి వచ్చి టాలీవుడ్ లో ఇంట్రెస్ట్ క్రియెట్ చేస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.

మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఒకవేళ ఈ ముగ్గురు స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తే సౌత్ లోనే క్రేజీ ప్రాజెక్ట్ గా నిలుస్తుంది. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. విజయేంద్రప్రసాద్ అందిస్తున్న ఈ కథ సినిమాకే హై లైట్ గా నిలువనుంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా మొదలుకానుంది.

Similar News