రవితేజకి నచ్చిన చిత్రం!

Update: 2017-10-30 01:40 GMT

అనాదికాలం నుండి ఒక హీరో సినిమా గురించి మరో హీరో మెచ్చుకోడం చాలా అరుదుగా జరుగుతుంది . సహజంగా ఏ హీరో అయినా.... తాను తన సినిమా మాత్రమే గొప్ప అనుకుంటాడు . వేరే హీరో చిత్రం పెద్ద హిట్ అయినా దాన్ని గురించి ఎటువంటి కామెంట్స్ చెయ్యరు. అసలు సినిమా రంగమే అంత . హిపోక్రసీ ఎక్కువ. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరైనా స్టార్ హీరో సినిమాల టీజర్లు, ట్రైలర్లు విడుదలైనప్పుడు మాత్రం ఆ హీరోగారి ఫ్రెండ్స్ అంటే మరికొంతమంది హీరోలు సోషల్ మీడియా వేదికగా పొగడ్తలు కురిపిస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా రవితేజ మాత్రం మరో హీరో సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు . అతనే అమీర్ ఖాన్. హిందీ రంగంలో తిరుగులేని కథానాయకుడు అమీర్ ఖాన్ నటించిన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ హిందీ సినిమా ఈ మధ్యనే ప్రపంచమంతా విడుదలైంది . ఈ చిత్రాన్ని చూసిన రవితేజ ఆ చిత్రం తనకి విపరీతంగా నచ్చిందని ట్వీట్ చేశాడు . అమీర్ ఖాన్ నటించిన ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ చిత్రం చూశాను . చాలా అద్భుతంగా వుంది .

నిజాయితీ కల వారిని పైకి రానీయకుండా తొక్కేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి చిత్రం అమీర్ చేయడం చాలా సంతోషంగా ఉందని రవితేజ పేర్కొన్నాడు .

Similar News