రవితేజ - రానా కాంబినేషనా...?

Update: 2017-10-26 07:52 GMT

ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు ఎక్కువమంది తమిళ్ సినిమాలను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగు స్టార్ హీరోలు సైతం రీమేక్ చేసి హిట్స్ అందుకుంటున్నారు. తమిళం సూపర్ హిట్ అయిన సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది. ఎందుకంటే తమిళ్ హీరోలు ఆ రేంజ్ లో సినిమాలు తీసి హిట్లు అందుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది తమిళ్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా 'విక్రం వేద'. అయితే ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని తెలుగు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన 'విక్రం వేద' సినిమా పూర్తి గ్యాంగ్ స్టార్ సినిమాగా తెరకెక్కింది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ లో ముందుగా రానా - వెంకటేష్ లు నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత రానా ప్లేస్ ని నాగార్జున తో రీప్లేస్ చేస్తూ నాగ్ - వెంకీ కలయికలో ఈ సినిమా వస్తున్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ లోకి మరో హీరో వచ్చి చేరాడు అతనే రవితేజ. ఈ మధ్యనే 'రాజా ది గ్రేట్' తో హిట్ అందుకున్న రవితేజ 'విక్రం వేద' రీమేక్ లో రానా తో కలిసి నటిస్తున్నట్టుగా టాక్ వినపడుతోంది.

ఇప్పటికే తెలుగు నిర్మాతలు కూడా రవితేజతో ఈ సినిమా గురించి మంతనాలు జరిపినట్టుగా సమాచారం అందుతుంది. ఇక తమిళంలో పుష్కర్ గాయత్రీ దర్శకత్వం వహించిన ఈ 'విక్రమ్ వేద' సినిమాని తెలుగులో ఏ హీరోల కలయికలో ఏ దర్శకుడు డైరెక్ట్ చేస్తారో చూద్దాం.

Similar News