రవితేజ మరోసారి ఆ పాత్రలో?

Update: 2017-12-01 12:00 GMT

రవితేజ 'విక్రమార్కుడు, మిరపకాయ్, పవర్' ఈ సినిమాల్లో ఎనర్జిటిక్ పోలీస్ ఆఫీసర్ గా ఆడియన్స్ ను మెప్పించాడు. మాములుగానే ఫుల్ ఎనర్జీతో ఉండే రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో అయితే మరింతగా రెచ్చిపోతాడు. కానీ కొన్నిరోజులుగా తానూ అనుకున్న హిట్ అందక బాధపడుతున్న రవితేజ కి 'రాజా ది గ్రేట్' ద్వారా మంచి కమర్షియల్ హిట్ లభించింది. 'రాజా ది గ్రేట్ ' లో కూడా సీక్రెట్ పోలీస్ గా పోలీస్ శాఖకి సహాయసహకారాలు అందించే పాత్రలో మెప్పించాడు. అయితే ఇప్పుడు ఈమధ్య సోషల్ మీడియాలో పోలీస్ గెటప్ లో ఉన్న రవితేజ కొత్త స్టిల్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి.

అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రవితేజ స్టిల్స్ రవితేజ నుండి వస్తున్నా మరో మూవీ 'టచ్ చేసి చూడు' నుంచి అని అర్ధం అవుతుంది. విక్రం సిరికొండ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని ఈ స్టిల్స్ చూస్తే అర్ధం అవుతుంది. చూస్తుంటే పోలీస్ గెటప్ లో మరోసారి మాస్ మహారాజ్ అదరగోట్టేయడం ఖాయమన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన రాశి ఖన్నా ఇంకా సీరత్ కపూర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశ లో ఉన్న'టచ్ చేసి చూడు' సినిమా ని వచ్చే ఏడాది సంక్రాంతికి బాలయ్య 'జై సింహ', పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' ల మీద పోటీగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు.

Similar News