ప్రస్తుతం ఉన్న హీరోలతో కంపేర్ చేసుకుంటే రవితేజ మార్కెట్ పర్లేదు. రవితేజ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ ఉంటుందని నిర్మాతలు అతనితో సినిమాలు తీయడానికి రెడీగా ఉంటారు. రవితేజ సినిమాలకు థియేట్రికల్ రెవెన్యూ పాతిక కోట్లు మించి రావడం లేదు. కానీ అతను 10 కోట్ల పారితోషికం అడిగితే ఎలా కుదురుతుందని అంటున్నారు నిర్మాతలు.
అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కున్నాడు రవితేజ. తనతో సినిమాలు తీసే నిర్మాతలకు తనకు పారితోషికం ఇవ్వవద్దని చెబుతున్నాడట. దానికి బదులుగా శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఇచ్చేయమని అడుగుతున్నాడట.
రవితేజ సినిమాలకి హిందీ డబ్బింగ్ రైట్సే.. శాటిలైట్ హక్కులు మొత్తంగా పధ్నాలుగు, పదిహేను కోట్లు ఈజీగా పలుకుతాయి. మరి రవితేజ కోరుకున్నట్టుగానే నిర్మాతలు ఈ పదిహేను కోట్లని వదులుకోవడానికి సై అంటారా లేదా నో అంటారా చూడాలి. రవితేజ అయితే మాత్రం పది కోట్లు హార్డ్ క్యాష్ లేదా ఆ రైట్స్ ఇమ్మని ఖచ్చితంగా చెబుతున్నాడట. మరి చూద్దాం రవితేజ పారితోషికం విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో..