రవితేజ పక్కన నటించనని చెప్పిందట

Update: 2017-12-16 06:40 GMT

భారీ గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ సినిమా తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. విక్రం సిరి కొండ దర్శత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశ లో ఉంది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే జనవరిలో సంక్రాతి కానుకగా టచ్ చేసి చూడు ఉంటుందనే విషయాన్నీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎక్కడ ధ్రువీకరించలేదు. అయితే ఈ సినిమా తరువాత రవితేజ, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడు.

ఈ నెలాఖరున మొదలు కాబోయే ఈ సినిమాని వచ్చే ఏడాది ఆరంభం లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశ లో ఉన్న కళ్యాణ్ కృష్ణ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్ వేట కొనసాగుతుంది. హీరోయిన్ ని వెతికే పనిలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు. అయితే కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా లో రవితేజ కి జోడి గా రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నాడట. అయితే ఆల్రెడీ రకుల్ తో కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా ఆఫర్ గురించి మాట్లాడాడు అని అంటున్నారు.

కాని రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం రవితేజ పక్కన నటించడానికి సుముఖంగా లేదు అని తెలుస్తుంది. ఇప్పుడు రకుల్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చెయ్యడం తో కళ్యాణ్ కృష్ణ ఇంకా రవితేజ మూవీ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు. మరి ప్రస్తుతానికి రకుల్ ప్రీత్ చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. ఒకసారి రవితేజ తో కిక్ 2 సినిమాలో జోడి కట్టింది. అలాగే రవితేజ కూడా రకుల్ కి మంచి ఫ్రెండ్ కూడా. మరి రకుల్ ఈ ఆఫర్ ని ఎందుకు తిరస్కరించిందో తెలియాల్సి ఉంది.

Similar News