రవితేజ అంతు చూస్తానంటున్న జగపతి బాబు!

Update: 2017-12-28 13:00 GMT

కళ్యాణ్ కృష్ణ తన మూడో ప్రాజెక్ట్ ని రవితేజ హీరోగా మొదలు పెట్టబోతున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాతో సక్సెస్ అందుకున్న రవితేజ ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా జనవరి నెలాఖరున విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా వున్నాయి. ఇకపోతే రవితేజ - కళ్యాణ్ కృష్ణ కలయికలో రూపొందుతున్న సినిమా జనవరి 5 న ప్రారంభమై.. జనవరి నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అయితే రవితేజ - కళ్యాణ్ కృష్ణ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారట.

మరి రవితేజ సరసన ఒక కొత్త హీరోయిన్ నటించబోతుందని చెబుతున్నారు. మాళవిక శర్మ అనే కొత్తమ్మాయి ని దర్శకుడు కళ్యాణ్ హీరోయిన్ గా ఈ సినిమాకి సెలెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇకపోతే లెజెండ్ చిత్రం తో విలన్ గా సినిమాల్లోకి రి ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడనే టాక్ వినబడుతుంది. మరి పవర్ ఫుల్ విలన్ గా కమ్ బ్యాక్ అయిన హీరో జగపతి బాబు రవితేజ తో ఎలా తలపడనున్నాడో చూద్దాం. ఇక ఈ సినిమాని ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్నాడు.

Similar News