సరిగా సినిమాలు ఆడడం లేని సమయంలో దిల్ రాజు.. రవి తేజకు మంచి హిట్ ఇచ్చాడు. 'రాజా ది గ్రేట్' సినిమా హిట్ అవ్వడంతో ఒక్కేసారి రెమ్యూనరేషన్ పెంచేసాడు రవి. 'టచ్ చేసి చూడు' సినిమాకి రవి తేజ కొంచం ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రవితేజపై ఇంతకుముందు నెలకొన్న అనుమానాలని మళ్లీ తెరపైకి తెచ్చింది. రవితేజ సినిమాలకి డిమాండ్ తక్కువగా ఉందని..తన సినిమాపై పెట్టె ఖర్చు తగ్గించాలని ఆమధ్య నిర్మాతలు డిసైడ్ అయ్యారు. 'రాజా ది గ్రేట్' హిట్ అవ్వడంతో మళ్లీ రవితేజ రేటు పెంచేసాడు.
'టచ్ చేసి చూడు' చిత్రం కూడా ప్లాప్ అవ్వడంతో... నాగ శౌర్య సినిమా కన్నా తక్కువ కలెక్షన్స్ రావడంతో రవితేజ పారితోషికం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. అయితే మరి రవి తగ్గి తను చేసే నెక్స్ట్ సినిమాలకి రెమ్యూనరేషన్ ఏమన్నా తక్కువ తీసుకుంటాడా లేదా తనకి ఇంత కావాలంటూ డిమాండ్ చేస్తాడో చూడాలి.