రజినీకాంత్ నటించిన 2.0 సినిమా వాయిదా పడినట్టు ఏ సినిమా ఇలా వాయిదా పడలేదేమో. ఏప్రిల్ లో దాదాపు కన్ఫర్మ్ అనుకున్న, చివరికి బాంబు పేల్చారు నిర్మాతలు. మరి ఇది బ్యాడ్ న్యూస్ అయితే.... ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే.. అదే రజిని సినిమా ఒకటి ఏప్రిల్ లోనే రిలీజ్ అవుతుంది కానీ 2.0 కాదు. రజిని ఇంకో సినిమా 'కాలా' రిలీజ్ అవుతుంది.
కొన్ని అనివార్య కారణాల వల్ల 2.0 వెనక్కివెళ్లింది. ఈ మూవీ వాయిదా పడడంతో ధనుష్ ‘కాలా’ను ముందుగానే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఈ సినిమాకు రంజిత్ పా దర్శకుడు కాగా రజిని అల్లుడు ధనుష్ ప్రొడ్యూసర్.
తమిళ్ న్యూ ఇయర్ ఏప్రిల్ 14 న రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా ని థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే దీని గురించి ఆఫీసియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.