రజిని కోసం ఉద్యోగం వదిలేసాడు!

Update: 2018-01-03 11:58 GMT

తమిళనాడులో చెన్నై లో జరిగిన అభిమాన సంఘాల మీటింగ్ లో తాను రాజకీయాల్లోకి రానున్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 31న అధికారికంగా ప్రకటించాడు. రజినీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. అభిమానులు టపాకాయలు కాల్చి , మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. కొంతమంది విమర్శించినవారు ఉన్నారు. రాజకీయ నాయకులూ రజినీపై దండెత్తారు కూడా. అయితే కొంతమంది సినీప్రముఖులు కూడా రజిని రాజకీయ రంగప్రవేశాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఇంకా రజినీకాంత్ సొంత పార్టీని ప్రకటించకముందే... రజినీకాంత్ కి వెన్నంటి ఉండేందుకు కొందరు సమాయత్తమవుతున్నారు.

అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం తన పదవికి రాజీనామా చేసి రజిని తో కలిసి రాజకీయాల్లో పనిచేయనున్నాడు. రాజు మహాలింగం రజినీకి వీరాభిమాని.. లైకా ప్రొడక్షన్స్ వారే శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న 2.0 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పనిచేసే సమయంలో రజినీకాంత్ భావాలకు ఫ్యాన్ అయిపోయిన రాజు మహాలింగం రజినీకాంత్ రాజకీయ జీవితంలో అతడికి తోడుగా ఉండాలని నిశ్చయించుకొని తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

Similar News