రజినీకాంత్ సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు కొన్ని సినిమాల్లో విలన్ గా చేసి మెప్పించాడు. కానీ హీరో అయ్యాక మళ్ళీ విలన్ పాత్రల వైపు చూడలేదు. మరి సూపర్ స్టార్ రేంజ్ లో ఉన్న రజినీ విలన్ పాత్రలు ఏం చేస్తాడులే అనుకునే ఆయనకి ఆ ఆఫర్స్ ఇచ్చి ఉండరు. కానీ ఆయన కూతురు సౌందర్య మాత్రం రజినిని విలన్ చెయ్యాలని అనిపించిందట. అయితే ఆ కలలను రజినీ ఆదిలోనే తుంచేశాడనే టాక్ వినబడుతుంది.
ఇంతకీ రజినీని విలన్ గా చేయమని కూతురు సౌందర్య రిక్వెస్ట్ చేసింది ఏ చిత్రానికో కాదు. తన బావ ధనుష్ ని హీరోగా పెట్టి విఐపి 2 సినిమాని తెరకెక్కిస్తోంది సౌందర్య. ఆ చిత్రం కోసం రజినీని విలన్ గా చేయాలనుకుంది. విఐపి 2 లో విలన్ పాత్ర కి రజినీకాంత్ ని తీసుకోవాలని ఆలోచించి ఆయన కోసమే ఆ పాత్రని రాసుకుందట సౌందర్య. ఆ విషయమై రజినీని సంప్రదించగా.. రజినీకాంత్ బాగా ఆలోచించి విలన్ పాత్ర చేయలేనని సున్నితంగా చెప్పేశాడట. మరి బావకి విలన్ గా తండ్రిని చూపిద్దామనుకున్న సౌందర్య ఆశ అడియాసే అయ్యింది. ఇక రజినీ కోసం రాసుకున్న ఆ పాత్రని ప్రస్తుతం బాలీవుడ్ నటి కాజోల్ చేస్తుందన్నమాట.
సో మనం రజినీకాంత్ ని విలన్ గా చూసే ఛాన్స్ అలా మిస్ అయ్యామన్నమాట. ఇక విఐపి 2 లో కాజోల్ సూపర్ విలనిజం కొద్దిగా మాత్రమే మనకు థియేట్రికల్ ట్రైలర్ లో పరిచయమైంది. ఇక సినిమాలో కాజోల్ విలన్ గా ఎంతగా రెచ్చిపోతుందో చూద్దాం. అమల పాల్ ధనుష్ భార్యగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.