రంగస్థలం సినిమాను డైరెక్టర్ సుకుమార్ ఏడాదిపై నుండే చెక్కుతున్నాడు. కానీ ఇప్పటికి ఆ సినిమా షూటింగ్ పూర్తవలేదు. కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమా మార్చ్ 30 న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. అయితే ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి.
కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంత ఇచ్చిన క్లారిటీతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించేసింది. రంగస్థలం సినిమాలో నా పార్ట్ పూర్తయిపోయింది అని చెప్పింది సామ్. అంతే కాదు.. ఇలాంటి స్పెషల్ తో జర్నీ చేసినందుకు బోలెడంత ఆనందంగా ఉందంటోంది. అలానే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తునట్టు చెప్పింది సామ్.
మొదట్లో ఈ సినిమా షూటింగ్ సమంత కోసమే ఆలస్యం అవుతుందనే టాక్ వచ్చింది. కానీ సమంతనే ఇప్పుడు స్వయంగా షూటింగ్ పార్ట్ పూర్తయిపోవడంతో పాటు.. సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ పాజిటివ్ అప్ డేట్ ఇచ్చేసరికి.. మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. సో మేకర్స్ చెప్పినట్టు మార్చ్ 30 న ఈ సినిమా రిలీజ్ కాయం అని తెలుస్తుంది.