సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ సౌండ్ ఇంజనీర్( వినికిడి లోపం ) గా యాక్ట్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ రెండున్నర గంటల సేపు పైనే వుంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 45 నిముషాలు ఉంటుందట. ఎంతో బలమైన కంటెంట్ ఉంటే తప్ప దర్శకులు ఇంత రన్ టైమ్ తో ఫైనల్ కాపీని సిద్ధం చేయలేరు. మరి ఇంత ధైర్యంగా రెండున్నర గంటల కంటే ఎక్కువ లెంగ్త్ ఉన్న సినిమాతో వస్తున్నారంటే సినిమాలో గొప్ప విషయమే ఉండుండాలి.
మరి నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ వేగంగా స్టార్ట్ చేసారు చిత్ర యూనిట్. ఉగాది రోజున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంటుంది.