సుకుమార్ - రామ్ చరణ్ ల 'రంగస్థలం 1985 ' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనేది క్లారిటీ లేకపోవడమేకాదు.. కనీసం ఈ సినిమాకి సంబందించిన చిన్న విషయం కూడా బయటికి రావడంలేదు. అప్పుడెప్పుడో కొన్ని లీకైన పిక్స్ తప్ప ఈ సినిమాకి సంబందించిన వివరాలేమీ తెలియవు. అయినాగానీ సుకుమార్ - చరణ్ కలయికలో వస్తున్నా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలతోనే రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా సంచలనాలు నమోదు చేస్తుంది. రామ్ చరణ్ కున్న మర్కెట్ వాల్యూతో పోలిస్తే..రంగస్థలం హక్కులకు అదిరిపోయే రేటు పలుకుతుంది.
రంగస్థలం చిత్రానికి ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం వైజాగ్ హక్కులని ఏవి సినిమాస్ వారు ఎన్ఆర్ఏ ఆధారంగా 50 లక్షల రికవరీ డీల్ తో 9 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ డీల్ అటు రామ్ చరణ్, ఇటు దర్శకుడు సుకుమార్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ డీల్. బాహుబలి తర్వాత ఈ ఏరియా లో అత్యధిక రేటు పలికిన మూడో చిత్రంగా చరణ్ రంగస్థలం రికార్డులకెక్కింది. అయితే రెండో స్థానంలోనూ మెగాహీరో సినిమానే ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం కావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి వైజాగ్ రైట్స్ 12 కోట్ల కి జరిగింది. మరి ఈ లెక్కన బాబాయ్ అబ్బాయిలిద్దరు కలిసి రికార్డు స్థాయిలో బిజినెస్ చేసి జనాలకు దడ పుట్టించేసారు.
మరి కనీసం ఫస్ట్ లుక్ గాని, టీజర్ గాని విడుదల కాకముందే రామ్ చరణ్ రంగస్థలం కి ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత నటించడం కూడా ఈ సినిమాకి మరో ప్రధాన కారణంగా వినబడుతుంది.