అల్లు అర్జున్ - పూజ హెగ్డే నటించిన 'దువ్వాడ జగన్నాథం' చిత్రం విడుదలకు ముందే బ్రాహ్మణ సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకతను చవి చూసింది. ఇక విడుదలయ్యాక క్రిటిక్స్ తో కూడా 'డీజే' చిత్రం విమర్శలపాలైంది. సినిమా ఏమాత్రంబాగోలేదని క్రిటిక్స్ 'డీజే' కి పూర్ రేటింగ్స్ ఇచ్చారు. మొదటిరోజే సినిమా పని అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అల్లు అర్జున్, హరీష్ శంకర్ ఈ రేటింగ్స్ పై బహిరంగంగానే స్పందించారు. వారికి సినిమా చూడం రాదనీ విమర్శించారు.
హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన 'డీజే దువ్వాడ జగన్నాథం' విడుదలై నెగెటివ్ టాక్ మూటగట్టుకున్నప్పటికీ వసూళ్లు మాత్రం కళ్లుచెదిరే ల వచ్చిపడ్డాయి. డీజే కలెక్షన్స్ 100 కోట్లు వచ్చాయంటూ ఆఫీసియల్ గా అనౌన్స్ చేసింది చిత్రం యూనిట్. సినిమా విడుదలై వారంకాకముందే డీజే చిత్రం 100 కోట్ల గ్రాస్ సాధించినది ఊదరగొట్టారు. అయితే ఇదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ మీడియాలోనే ప్రచారం జరిగింది. ఇక యుఎస్ ట్రిప్ లోఉన్న డీజే టీమ్ అక్కడ కూడా మీడియా వారిని విమర్శిస్తూనే వున్నారు. అయితే ఇప్పుడు తాజాగా హరీష్ శంకర్ ఒక ట్వీట్ చేసాడు.
అయితే తాజాగా హరీష్ శంకర్ ‘డీజే’ సినిమా నైజాం ఏరియాలో 20 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టిందని ఆఫీసియల్ గా అనౌన్స్ చేస్తూ డైరెక్టర్ హరీష్ ఒక ట్వీట్ చేశాడు. సినిమా విజయాన్ని ఎంజయ్ చేయాలనుకుంటున్నా.. కానీ, తప్పడం లేదు.. యుద్ధం శరణం గచ్ఛామి. అంటూనే ఎవరైనా మాకొచ్చిన కలెక్షన్లు తప్పు అని రుజువు చెయ్యగలిగితే నేను ఇక సినిమాలు తీయడం మానేస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే మీ వెబ్‌సైట్లు మూసెయ్యగలరా... ‘గబ్బర్‌సింగ్’ తర్వాత ‘డీజే’ నైజాంలో ఇలా 20 కోట్లు వసూలు చేయడం నాకు ఆనందంగా, గర్వంగా ఉంది అంటూనే... క్షమించండి.. ప్రస్తుతం సినిమా విజయాన్ని ఏంజాయ్ చేయాలనుకుంటున్నా. అంటూ యుద్ధం చేస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పాడు. అంతేలే సినిమా బాగోలేదంటే ఏ డైరెక్టర్ ఒప్పుకుంటాడు గనక. ఇకపోతే కలెక్షన్స్ బావున్నాయి అంటే సినిమా హిట్ అయ్యిందానికిందే లెక్క అని కూడా వీరు అనుకోబట్టే డీజే కలెక్షన్స్ గురించి ఇంతలా పబ్లిసిటీ చేస్తున్నారు.