మాస్ ఫాలోయింగ్ వున్న అల్లు అర్జున్ రీసెంట్ గా 'దువ్వాడ జగన్నాధం' తో కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. అదే ఊపులో తన నెక్స్ట్ మూవీ కూడా స్టార్ట్ చేసేసాడు. ఎప్పటినుండో డైరెక్టర్ అవ్వాలనే ఆశతో స్టార్ హీరోస్ చుట్టూ తిరుగుతూ బన్నీకి కథ చెప్పి ఒకే చేయించుకున్నాడు వక్కంతం వంశీ. ఈ సినిమాతో తన కల నెరవేరింది. ఈ సినిమాకి “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” అని టైటిల్ పెట్టి శరవేగంగా చిత్రిస్తున్నారు.
ఇటీవలే ఊటీలో భారీ షెడ్యూల్ ని పూర్తిచేసుకున్నారు. ఈ షెడ్యూల్లో హెవీ యాక్షన్ సన్నివేశాలని షూట్ చేస్తారట. ఇవి చాలా హై వోల్టేజ్ యాక్షన్ కంటెంట్ కలిగి సినిమాకే హైలేట్ గా నిలుస్తాయి అని మూవీ యూనిట్ భావిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 5 నుండి కొత్త షెడ్యూల్ లోకి వెళ్లనుంది. నాగబాబు సమర్పణలో శ్రీధర్, శిరీష ఇంకా బన్నీవాసులు నిర్మిస్తున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా, యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ వంటి సీనియర్ స్టార్ నటులు నటిస్తున్నారు.