పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అయ్యి దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు ఆ మూవీ షూటింగ్ 75 శాతం పూర్తయిందని చెబుతున్నారు గాని ఇంతవరకు ఆ మూవీకి సంబందించిన అప్ డేట్ మాత్రమే కాదు కనీసం టైటిల్ కూడా పెట్టకుండా ఫుల్ సస్పెన్సు మైంటైన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ వాళ్ళు. ఇంకేంటి ఈ ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన్ ఫస్ట్ లుక్ గాని, టైటిల్ గాని బయటికి వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఫాన్స్ కి నిరాశే మిగిలింది. అయితే ఇప్పుడు కాదు గాని పవన్ బర్త్ డే కి పవన్ ఫస్ట్ లుక్ గాని, టైటిల్ గాని వదులుతామని త్రివిక్రమ్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే పవన్, త్రివిక్రమ్ సినిమాకి టైటిల్ గురించి అనేక రకాల టైటిల్స్ వాడుకలోకి వచ్చాయి. ముందుగా 'ఇంజినీర్ బాబు' అంటూ ఆ తరవాత అనేక రకాల టైటిల్స్ వినిపించాయి.కానీ వీటిన్నిటిని చిత్ర యూనిట్ ద్రువీకరించకపోయేసరికి ఇప్పుడు కొత్తగా ‘రాజు వచ్చినాడు’ అన్న టైటిల్ వినిపిస్తోంది. కానీ ఈ ‘రాజు వచ్చినాడు’ అనే టైటిల్ పవన్ కి అస్సలు మ్యాచ్ కాదని.... ఆ టైటిల్ పవన్ కి పెట్టడమేమిటి.... అంటూ చిత్ర యూనిట్ చిందులు వేస్తుంది. ఆ టైటిల్ పవన్ కి పెట్టే సమస్యే లేదంటుంది. ఇక చిత్ర యూనిట్ పవన్ 25వ సినిమా టైటిల్ ను తాము ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్నామని.... కొత్త టైటిల్ కోసం డైరక్టర్ త్రివిక్రమ్ చాలా ఆలోచిస్తున్నారని అంటున్నారు. అలాగే పవన్ కొత్త మూవీ టైటిల్ కచ్చితంగా ఓ రేంజ్ లో వుంటుందంటున్నారు.
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండు సినిమాల టైటిల్స్ దేనికవే సాటి. మొదటిది 'జల్సా' అంటూ కామెడీ పండించి..... రెండోది 'అత్తారింటికి దారేది' అంటూ ఎమోషనల్ గా కట్టిపడేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మూడో సినిమాకి ఇంకేలాంటి టైటిల్ ని ఆలోచిస్తున్నాడో మరి. మరి నిజంగా పవన్ కళ్యాణ్ న్యూ మూవీ టైటిల్ ఫాన్స్, చిత్ర యూనిట్ చెప్పినట్టు ఒక రేంజ్ లో ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తాడనే నమ్మకమైతే చాలామందిలో ఉంది. మరి ఫైనల్గా పవన్ టైటిల్ కోసం ఇంకెంత కాలం ఎదురు చూడాలో మరి.