కొడుకులు హీరోగా టాలీవుడ్ లో సెటిల్ అయినా కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా సినిమాల మీద సినిమాలు లైన్లో పెడుతూ కొడుకులకు గట్టి పోటీ ఇస్తున్నాడు నాగార్జున. ఒకపక్క నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఇక వారి సినిమాలకు నిర్మాతగా చేస్తూనే నాగ్ మరోవైపు హీరోగా సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం నాగ్ నటించిన 'రాజుగారి గది 2 ' విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ చిత్రం తర్వాత నాగార్జున మరో యంగ్ డైరెక్టర్ కి డేట్స్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు నాగార్జున నిర్మించిన 'ఉయ్యాలా జంపాల' డైరెక్టర్ విరంచి వర్మ అంట. ఇక 'ఉయ్యాలా జంపాల' హిట్ తర్వాత నాని హీరోగా విరంచి మజ్ను తీసాడు.అది కూడా డీసెంట్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ యువ దర్శకుడు విరంచి చెప్పిన స్టోరీ లైన్ కి ఫిదా అయిన నాగ్ స్క్రిప్ట్ డెవెలెప్ చెయ్యాల్సిందిగా ఆ దర్శకుడుడికి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. అయితే నాగార్జున తో విరంచి వర్మ చేసే సినిమా ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట.
ఇక అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి నాగార్జున నిర్మాత. అయితే అఖిల్ చిత్రం పూర్తి కాగానే నాగ్ నిర్మతగా ప్రస్తుతానికి సినిమాలు చెయ్యడంట. ఎవరైనా డైరెక్టర్ మంచి కథతో వస్తే మాత్రం సినిమాలు నిర్మిస్తానని చెబుతున్నాడు నాగ్.