తెలుగు, తమిళంలో హీరోయిన్ గా ఎదగలేక నానా కష్టాలు పడుతూ ఇప్పుడు బికినీ ఫోటో షూట్స్ తో దర్శకనిర్మాతలు రెచ్చగొడుతూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నికిషా పటేల్.. తాను హీరోయిన్ గా మారానన్న ఒకే ఒక్క కారణంతో తన బాయ్ ఫ్రెండ్ తనని వదిలేసిపోయాడని చెబుతుంది. హీరోయిన్ గా మారడం వలనే తనని పెళ్లి చేసుకోవడానికి కూడా తన బాయ్ ఫ్రెండ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదంటూ తన బాధను వెళ్లగక్కుతోంది. ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నికిషా తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది.
ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తన వ్యక్తిగత జీవితాన్ని నష్ట పోయానని చెబుతుంది. అంతేకాకూండా ఈ మధ్యన హీరోయిన్స్ అంత క్యాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతున్నట్టే నికిషా కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి మీద నోరు విప్పింది. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి చోట ఉంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు లైంగిక వేధింపులు అనేది కామన్ అయిపోయాయి. హాలీవుడ్ లో హార్వే వ్యవహారం బయటకొచ్చిన తర్వాత నాన్న నాకు ఫోన్ చేశారు. టాలీవుడ్ లో ఇలాంటివి జరుగుతున్నాయా అని నన్ను అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. కాస్టింగ్ కౌచ్ విషయానికొస్తే హాలీవుడ్ కు, టాలీవుడ్ కు పెద్ద తేడా లేదు అంటూ చెప్పిన తనని ఎవరైనా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
మరి నికిషా పాటిల్ కూడా హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఇలాంటి అవమానాలు ఎదుర్కుందా? లేదంటే నికిషా ఇలా కాస్టింగ్ కౌచ్ గురించిన విషయాలు మాట్లాడదు కదా అంటున్నారు. మరి హీరోయిన్స్ అంతా ఇలా సినిమా ఇండస్ట్రీస్ ని చీడ పురుగులా పట్టి పీడిస్తున్న కాస్టింగ్ కౌచ్ గురించి గొంతు చించుకుంటుంటే.. దానికి కారణమయిన వారు మాత్రం ఎంచక్కా తమ పనులు తాము చేసుకుపోతున్నారు.