మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు!

Update: 2017-08-08 07:00 GMT

సినిమా హీరోలకు కేవలం బయట మాత్రమే అభిమానులుండరు. పెద్ద స్టార్స్ కి సినిమా ఇండస్ట్రీలోని యువ హీరోలు కూడా పిచ్చ అభిమానులే చాలామంది ఉంటారు. ఆ అభిమాన హీరోలు తాము ఆరాధించే స్టార్ హీరోలను అనుకరిస్తూ తమ సినిమాల్లో వాటిని వాడేస్తుంటారు. అలా ఒక స్టార్ హీరోని ఎక్కువగా వాడేసే వారిలో టాలీవడ్ లో ముందు వరుసలో యంగ్ హీరో నితిన్ ఉంటాడు. నితీన్, పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ దేవుడంటూ అన్ని ఫంక్షన్స్ లో ఓపెన్ గానే చెప్పేస్తుంటాడు.

అలాగే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకు నచ్చిన కొన్ని సీన్స్ ని నితిన్ తన సినిమాల్లో బాగా వాడేస్తుంటాడు. మరి ఇంతటి అభిమానాన్ని అందుకుంటున్న పవన్ కళ్యాణ్ కి నితిన్ అంటే చాలా అభిమానమే. అందుకే నితిన్ సినిమా ఫంక్షన్స్ కి గెస్ట్ గా వెళుతుంటాడు. ఇప్పుడు నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ ఆయన ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఒక సినిమాని కూడా నిర్మిస్తున్నారు. కాగా నితిన్ ఇప్పుడు తన తాజా చిత్రం 'లై' సినిమాని ఈ నెల 11 న థియేటర్స్ లోకి దింపుతున్న కారణంగా ఆ సినిమా ప్రమోషన్స్ తో బాగా బిజీగా వున్నాడు.

అందులో భాగంగా ఇక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలలో నాకు దేవుడు లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూనే నటనను నేర్చుకున్నాను. నాకు నటనలో ప్రేరణ ఎవరైనా ఇచ్చారు అంటే అది నా బాస్ పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెబుతున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోని సీన్స్ ని నేను నా సినిమాల్లో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానని..... ఇప్పుడు 'లై' సినిమాలో ‘బంబాట్’ అనే పాట తమ్ముడు సినిమాలో ‘వయ్యారి భామ’ పాటను స్ఫూర్తిగా తీసుకొని చేశాము అని చెబుతున్నాడు. అంతేకాకుండా ఇకముందు నేను హీరోగా రాబోయే సినిమాలులో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలలో ఉన్నవి నాకు బాగా నచ్చినవి వాడేస్తానని మొహమాటంగా లేకుండా చెప్పేస్తున్నాడు.

Similar News