ఈ మధ్యన ‘మెర్శల్’ సినిమా మీద జరిగిన చర్చ మరే ఇతర సినిమాపై జరగలేదు. తమిళనాట దీపావళికి విడుదలైన ఈ సినిమా లో విజయ్, సమంత, కాజల్, నిత్యా మీనన్ లు నటించారు. ఈ సినిమా విడుదలయిన తర్వాత ఈ సినిమా చుట్టూ అనేక వివాదాలు రాజుకున్నాయి. ఆ వివాదాలు వలన మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమాకు భలేగా కలిసొచ్చి.. ఓ మాదిరి హిట్ అవుతుందని అనుకున్న ఈ సినిమా దాని కంటే పెద్ద హిట్టయింది. అలాగే తమిళనాట అనుకున్న సమయానికే విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ విడుదల కావాల్సి ఉందని.
అయితే ఈ సినిమాకి తెలుగు సెన్సార్ పూర్తి కానీ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మాములుగా అయితే హీరో విజయ్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. విజయ్ సినిమాలు తెలుగులోకి దబ్ అవుతున్నాయి అంటే అంతగా ఎగ్జైట్మెంట్ కనిపించదు. కానీ ఇప్పుడు తమిళనాట వివాదాలతో ఫెమస్ అయిన ఈ 'అదిరింది' సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి ఆసక్తిని కనబరుస్తున్నారు. కాకపోతే వాయిదాల మీద వాయిదాలు పడటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి తగ్గిందంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు తెలుగు నిర్మాతలు. అదిరింది సెన్సార్ పూర్తి చేసుకోవడం.. విడులకు అన్ని అడ్డంకులూ తొలగిపోవడంతో నవంబరు 9న థియేటర్లలో దిగడానికి ముహూర్తం చేసుకుందీ 'అదిరింది' చిత్రం.
మరి నవంబరు 10న తెలుగులో మూడు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. ఎటువంటి అదురుబెదురు లేకుండా... ఒక రోజు ముందే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేస్తున్నారు. చూద్దాం తెలుగులో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకోబోతుందో?