మొత్తానికి దొరికి పోయారన్నమాట!!

Update: 2017-07-11 04:06 GMT

డీజే సినిమా విడుదలకు ముందే కావాల్సినంత కాంట్రవర్సీ అయ్యింది. బ్రాహ్మణులతో వచ్చిన గొడవలను ఎలాగో సర్దుబాటు చేసుకున్న డీజే చిత్ర నిర్మాత డీల్ రాజు ఇప్పుడు మాత్రం పీకల్లోతు ప్రాబ్లెమ్ లో కూరుకుపోయాడు. దిల్‌రాజు నిర్మాణంలో హరీష్‌శంకర్‌ డైరెక్షన్ లో అల్లు అర్జున్ - పూజ హెగ్డే జంటగా వచ్చిన డిజె విషయంలో రివ్యూ రైటర్స్‌, యాంటీ ఫ్యాన్స్‌ గురించి చిత్రం యూనిట్‌ ఆచితూచి స్పందించకుండా దూకుడుగా స్పందించింది. మరి మెగాఫ్యాన్స్‌ని కూల్‌ చేయాల్సిందిపోయి దిల్‌రాజు, హరీష్‌శంకర్‌, ఆలు అర్జున్ లు అగ్నికి మరింత ఆజ్యం పోశారు.

అసలు డీజే కలెక్షన్స్ 100 కోట్ల గ్రాస్ వచ్చిందని సినిమా విడుదలైన ఐదవ రోజునే ప్రకటించేశారు. ఒక్క ప్రకటించటంతో ఆగారా.. అంటే లేదు వాటిని పోస్టర్స్ వేయించి గోడలకు అంటించేసారు. అయితే సినిమాకి అస్సలు పాజిటివ్ టాక్ లేకుండా పోయేసరికి ఇక ఓవర్‌సీస్‌లో ఇది దారుణమైన ఫలితం పొందింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం టాక్‌కి సంబంధం లేకుండా వీకెండ్‌తో పాటు, రంజాన్‌ వరకు డిజె హవా నడిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాతకలెక్షన్లు పడిపోయాయి. ఇక డైరెక్టర్ గారేమో మా చిత్రం 100 కోట్లు వసూలు చెయ్యడమే కాదు... నైజాంలో నాన్‌-బాహుబలి రికార్డులను తిరగరాసిందని, దీనిపై ఎవరితోనైనా సవాల్‌కి సిద్దమేనని కయ్యానికి కాలు దువ్వాడు.

అయితే హరీష్ చెప్పనట్టు ఇంతకు ముందు ఉన్న నాన్‌-బాహుబలిరికార్డులను చిరంజీవి 'ఖైదీనెంబర్‌ 150' పేరుపైఉన్నాయి. అంటే చిరు సినిమాని మించి, ఆ రికార్డులను కొల్లగొట్టి డిజె ముందంజలో ఉందని చెప్పినట్లే లెక్క. ఇదిగో ఇక్కడే మెగా ఫ్యాన్స్ కి బాగా కాలింది. అసలు డీజే 100 కోట్లు కొల్లగొట్టలేదని... ఇది నిజం కాదని మెగాఫ్యాన్స్‌ వారే మండిపడుతున్నారు. నైజాం నుంచి తొలివారంలోనే 20కోట్లకు పైగా షేర్‌ వస్తే డిజె.... ఖైదీని దాటినట్టే కానీ ఈ విషయాన్ని ఎత్తితే మాత్రం డిజె యూనిట్‌సైలెంట్‌ అయిపోయింది. ఇక చిరంజీవి ఖైదీ కంటే డీజే అంత గొప్పగా లేదని... అసలు ఉత్తుత్తి పోస్టర్స్దీం తో ఫ్యాన్స్తో ని ఎందుకు మభ్య పెట్టారంటూ ఫిదా ఆడియో వేడుక కోసం హైదరాబాద్‌ వచ్చిన మెగాభిమానులు డిజె నిర్మాత దిల్ రాజు ఆఫిస్ ముందు ధర్నాకు దిగారు.

అలాగే కలెక్షన్స్ ని ఆధారాలతో సహా బయటపెట్టాలని దిల్‌రాజుని నిలదీయడంతో వారికి సర్ధిచెప్పలేక దిల్‌రాజు తల ప్రాణం తోకకి వచ్చినట్టు చెబుతున్నారు. అసలు సినిమాకి హైప్ రావాలంటే అనేక మార్గాల ద్వారా పబ్లిసిటీ నిర్వహించుకోవచ్చు గాని ఇలా తప్పుడు లెక్కలు చూపించి ఎవ్వరిని మభ్యపెడదామని అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఇంతగా రచ్చ జరుగుతున్నా హరీష్ శంకర్ గారు బయటికి వచ్చి డీజే చిత్ర కలెక్షన్స్ లెక్కలు బయట పెట్టొచ్చుగా. అలాగే బన్నీ కూడా సైలెంట్ అయ్యాడు.... అంటే ఇందులో ఎదో తిరకాసు ఉన్నట్లు సామాన్య ప్రేక్షకుడికి కూడా ఈజీగా అర్ధమవుతుందన్నమాట.

Similar News