మొత్తానికి టాప్ త్రీ కొచ్చేసాడు

Update: 2017-08-20 12:00 GMT

ఇప్పుడు సినిమా మొదలైనప్పటినుండి ఆ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటే థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యే వరకు ఫాన్స్ హడావిడి మాములుగా ఉండదు. ఇక టీజర్, ట్రైలర్ విడుదలయ్యింది అంటే..... అవి ఇంతకుముందు సినిమాల టీజర్స్ కి, ట్రైలర్స్ కి పోలిక పెట్టేసి యూట్యూబ్ లో ఎవరి టీజర్, ట్రైలర్ కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి. ఎన్ని డిస లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే దాని మీద జరిగే రచ్చకి అంతేలేకుండా పోతుంది.

ఇక ఆ రచ్చ ఎలా ఉంటుంది అంటే హీరోల ఫాన్స్ మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ కొట్టుకునే స్థాయిలో. అది కూడా కోల్డ్ వార్ జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు బాలకృష్ణ, పూరి డైరెక్షన్ లో నటిస్తున్న 'పైసా వసూల్' చిత్రం మొన్న ఆగష్టు 17 న ఆడియో వేడుకలో విడుదల చేసిన 'పైసా వసూల్' థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్లో సంచలనాలు క్రియేట్ చేస్తుంది. 'పైసా వసూల్' ట్రైలర్ విడుదలైన 24గంటల్లో 2.9 మిలియన్ల వ్యూస్ సాధించింది. యూట్యూబ్ లో ట్రైలర్ విషయంలో టాప్ త్రీ ప్లేస్ ను కొట్టేసింది.

మరి ఇప్పటివరకు టాప్ త్రీ ప్లేస్ లో వున్న చిరు 'ఖైదీ నెంబర్ 150 'ని నాలుగోప్లేస్ కు వచ్చేసింది. చిరు సినిమా 24గంటల్లో 2.4మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించి 'పైసా వసూల్' కన్నా వెనకబడింది. ఇకపోతే యూట్యూబ్ లో టాప్ లో 'బాహుబలి 2 ' ఉండగా, సెకండ్ ప్లేస్ లో అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' వుంది. ఇక ఇప్పుడు కొత్తగా టాప్ త్రీ లోకి బాలకృష్ణ 'పైసా వసూల్' వచ్చి చిరు ఖైదీని నాలుగో స్థానంలోకి నెట్టేసింది. ఇక ఐదో స్థానంలో పవన్ నటించిన 'కాటమరాయుడు' ఉంది.

Similar News