మొత్తం మీద ఐదు నిమిషాల నిడివి తగ్గిన అజ్ఞాతవాసి

Update: 2018-01-13 11:39 GMT

అజ్ఞాతవాసి వాసి చిత్రం ప్రథమార్ధం లో ఇద్దరు హీరోయిన్స్ తో వచ్చే హీరో రొమాంటిక్ ట్రాక్ మరియు హీరో పవన్ కళ్యాణ్ నంగి గా కనపరిచే హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకి విరక్తి కలిగిస్తుండటంతో సినిమా నిడివి బాగా ఎక్కువ గా అనిపిస్తుంది. మరో వైపు చిత్రం విడుదల నుంచి ఊరిస్తున్న విక్టరీ వెంకటేష్ అతిధి పాత్ర పోషించిన సన్నివేశం జోడించటానికి దర్శక నిర్మాతలకి ఈ నిడివి ప్రధాన సమస్యగా మారింది.

వెంకీ నటించిన సన్నివేశం....

ఇప్పటికే మేకింగ్ వీడియో కూడా విడుదల కావటంతో వెంకటేష్ అభిమానులు తమ అభిమాన నటుడి సన్నివేశాలు జోడిస్తే మరొకసారి అజ్ఞాతవాసి చిత్రాన్ని వీక్షించటానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే డ్రాప్ అయిన వసూళ్ల జోరు కొంత మేరనైనా పెంచటానికి ఈ మేకింగ్ వీడియో కి వస్తున్న క్రేజ్ సహకరిస్తుంది అని నమ్ముతున్న నిర్మాతకి వెంకటేష్ నటించిన సన్నివేశం జోడించక తప్పని పరిస్థితి. దానితో అజ్ఞాతవాసి చిత్ర నిడివి నుంచి 12 నిమిషాల నిడివిని ట్రిమ్ చేసి ఇప్పుడు వెంకీ కనిపించే సన్నివేశం 7 నిమిషాల 26 క్షణాల నిడివిని జోడించారు. ఈ లెక్కలన్నీ చూస్తే అజ్ఞాతవాసి చిత్ర నిడివి 5 నిమిషాలు తగ్గించబడింది.

Similar News