మెహ్రీన్ డిమాండ్స్

Update: 2018-03-24 10:18 GMT

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో మెహ్రీన్ కౌర్ పిర్జాదా ఒకరు. ఈమె సినిమాలు ఆడిన ఆడకపోయినా ఆమెకు అవకాశాలు మాత్రం వస్తూనే వున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ అమ్ముడు గురించి వార్త ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది.

'ఛలో' సక్సెస్ తర్వాత నాగశౌర్య 'నర్తనశాల' సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మెహ్రీన్ ని సంప్రదించగా.. ఈ ముద్దుగమ్మ నిర్మాతల ముందు వివిధ డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం 90 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేయటమే కాకుండా చేతి ఖర్చులు కోసం ప్రతి రోజూ 20,000 ఇవ్వాలని షరతులు పెట్టిందట.

దీంతో నిర్మాతలు ఈ సినిమాలో ఆమెను తీసుకోవాలా? లేదా వేరే హీరోయిన్ ని సంప్రదించాలా? అన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 12న సెట్స్‌ పైకి రానున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది చిత్రయూనిట్ ప్రకటించాల్సి ఉంది.

Similar News