చాలా కాలంగా అంటే జనతా గ్యారేజ్ సినిమాలో నటించిన తర్వాత తెలుగు సినిమాలకి దూరంగా ఉంటున్ననిత్యా మీనన్ ప్రస్తుతానికి తమిళ్ లో స్టార్ హీరో విజయ్ సరసన్ మెర్సల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఈ దీపావళి కానుకగా తెలుగు, తమిళంలో విడుదలవుతుంది. ఇక నిత్యా మీనన్ మెర్సిల్ తరువాత ఒక మళయాళ లేడీ ఓరియెంటెడ్ సినిమా లో నటించనుంది అంటున్నారు. ప్రముఖ మలయాళ దర్శకుడు వికే ప్రకాష్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది.
అయితే ఈ సినిమా కథ హిల్ స్టేషన్ లో నివసించే ఒక ఆంగ్ల రచయిత గురించి ఉంటుందట. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ నిత్యా మీనన్ ప్రస్తుతం సమాజంలో అన్యాయలతో ఎలా పోరాడింది అనేదే అసలు కథాంశం అని దర్శకుడు చెబుతున్నాడు. ఇక ఈ సినిమాకు ప్రాణ అనే టైటిల్ ను సెట్ చేశాడు డైరెక్టర్. ఒకేసారి తెలుగు, తమిళ్ మరియు మలయాళం తో పాటు కన్నడంలో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి.శ్రీరామ్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.
అలాగే ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజనీర్ రసూల్ పుకుట్టి కూడా ఈ సినిమా కి వర్క్ చేస్తుండడం విశేషం. నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు చెబుతున్నాడు. ఇక రసూల్ ఈ సినిమాకు కొత్త తరహా సౌండ్ టెక్నాలజీ ని వాడుతున్నారట. మరి కెరీర్ లో తొలి సారి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటిస్తున్ననిత్యా మీనన్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూద్దాం.